ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు - ఒకే రోజు, మార్గదర్శకాలు..!!
మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ సారి వేర్వేరు వేరియంట్లలో కరోనా విస్తరిస్తోంది. దీంతో, ప్రభుత్వం అప్రమత్తం అయింది. తాజా కేసులతో ఆందోళన అవసరం లేకపోయినా.. నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏలూరు కలెక్టరేట్ లో పని చేస్తున్న అయిదు గురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో, వారిని హోం ఐసోలేషన్ కు తరలించారు. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగానూ కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది.
ఏలూరు లో అయిదు కేసులు
ఏపీలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం రేపింది. కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్‌గా వైద్యులు నిర్థారించారు. దీంతో వారిని హోం ఐసోలేషన్‌కు తరలించారు. కలెక్టరేట్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిం చగా.. ఐదుగురికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. మిగిలిన సిబ్బందికి నెగెటివ్‌గా వచ్చింది. కలెక్ట రేట్‌లో ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో తోటి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో, ప్రభుత్వ అధికారులు ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్‌లోని రెండు సెక్షన్ల సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. గోదావరి జిల్లాల్లో గత కొన్ని రోజులుగా పదికి పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

అప్రమత్తం
కలెక్టరేట్‌లో కరోనా నిర్ధారణ అవడంతో అప్రత్తమైన అధికారులు ఎక్కడికక్కడ శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. ఇక ఏపీలో తొలి కరోనా కేసు విశాఖపట్నంలో నమోదు అయ్యింది. విశాఖకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో వెంటనే చికిత్స అందేశారు. ఆమె కుటుంబం ఉంటోన్న పరిసరాల్లో శానిటైజేషన్ చేశారు. అలాగే కడప రిమ్స్‌లో 70 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ అని తేల్చారు వైద్యులు. జలుబు, జ్వరంతో బాధపడుతున్న మహిళకు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనాగా నిర్ధారణ అయ్యింది. దేశ వ్యాప్తంగానూ కరోనా కేసుల సంఖ్య ఏకంగా 2,710కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం, కేరళలో అత్యధికంగా 1,147 యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నాయి.
నిర్లక్ష్యం వద్దు
తరువాతి స్థానాల్లో మహారాష్ట్ర (424), ఢిల్లీ (294), గుజరాత్ (223), కర్ణాటక (148), తమిళ నాడు (148), పశ్చిమ బెంగాల్ (116) ఉన్నాయి. గత 24 గంటల్లో మహారాష్ట్రలో కొవిడ్ బారిన పడ్డ ఇద్దరు మరణించగా ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులో ఒక్కొ మరణం చొప్పున నమోదయ్యాయి. అధిక శాతం కొవిడ్ కేసుల్లో వ్యాధి తీవ్రత మధ్యస్థంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications