గుంటూరుజిల్లాలో సైకో దాడి...ముగ్గురికి తీవ్రగాయాలు

గుంటూరు: ఓ మసీదుపై సైకో దాడి చేసిన ఘటనలో మొత్తం ఐదుగురు గాయపడగా వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే అప్రమప్తమై సైకోను పట్టుకుని దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

పోలీసుల కథనం మేరకు...రెంటచింతల మండలం పసర్లపాడు గ్రామానికి చెందిన షేక్ జానీ పాషాకు గత కొంత కాలంగా మానసిక పరిస్థితి సరిగా లేదు. దీంతో పాషా తండ్రి అతడిని గుంటూరు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం గుంటూరు నుంచి పాషాను అతడి తండ్రి వెంటబెట్టుకొని గ్రామానికి తిరిగి తీసుకు వస్తుండగా మార్గమధ్యంలో అతడు తండ్రిపై దాడి చేసి తప్పించుకొని పారిపోయాడు.

Five injured in Psycho attack on prayer hall in Guntur District

ఆ తరువాత మాచర్ల చేరుకున్న అతడు పట్టణంలోని మసీదులోకి చొరబడి అక్కడ నమాజు చేసుకుంటున్న వారిపై ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. దీంతో ఐదుగురు గాయపడ్డారు. ఈ దాడి గమనించిన తోటి ముస్లింలు వెంటే సైకో పాషాను పట్టుకొని దేహశుద్ధి చేసి ఆ తరువాత పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు.

సైకో దాడిలో గాయపడిన ఐదుగురులో బాగా దెబ్బలు తగిలిన ముగ్గురిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మతిస్థిమితం లేకనే అతడు దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+