జనసేనతో తెలుగుదేశం సమన్వయ కమిటీ: సభ్యులుగా కీలక నేతలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో జనసేనతో సమన్వయం కోసం తెలుగుదేశం పార్టీ ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. కమిటీ సభ్యులుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, పితని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య ఉన్నారు.

టీడీపీ-జనసే కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేయనుంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని రెండు పార్టీలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే టీడీపీతో సమన్వయం చేసుకునేందుకు జనసేన పార్టీ ఒక కమిటీని ప్రకటించారు. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉమ్మడి ఏపీకి స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల అనుభవం ఇరుపార్టీల మధ్య సమన్వయం కోసం ఉపయోగపడుతుందన్నారు.

 five members tdp committee for coordination with janasena party

చంద్రబాబు ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు: పవన్ కళ్యాణ్

జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వ వైఖరీ అమానవీయం. ఆయన ఆరోగ్య సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష ధోరణి సరికాదని పవన్ శ్యాఖ్యానించారు.

వైద్యుల నివేదికలను పట్టించుకోకపోవడం సరికాదన్నారు పవన్. జైళ్ల శాఖ అధికారుల వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయన్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జైలు అధికారులు గత మూడు నాలుగు రోజులుగా హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు. మరోవైపు, చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబుపై కక్షసాధిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+