ప్రత్యేక హోదా: ఆల్ పార్టీ మీటింగ్‌కు ఐదు పార్టీలు దూరం బాబుకు అవకాశమేనా?

అమరావతి:ప్రత్యేక హోదా విషయమై ఏపీ రాష్ట్రప్రభుత్వం ఇవాళ నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి ప్రధాన పార్టీలు దూరంగా ఉంటామని ప్రకటించాయి.అయితే ప్రత్యేకహోదా విషయమై రాజకీయాలకు అతీతంగా తాము ప్రయత్నాలు చేసినా విపక్షాలు అందుకు సహకరించలేదని చెప్పేందుకు అధికార టిడిపికి అవకాశం చిక్కింది. కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని ప్రకటించాల్సి ఉంది.

ఏపీకి ప్రత్యేక హోదా విషయమై తాను ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏప్రిల్ 7వ, తేదిన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి అన్ని పార్టీలకు ఆహ్వనాలు పంపారు. అంతేకాదు మంత్రులు కొన్ని పార్టీల వద్దకు ప్రత్యేకంగా వెళ్ళి ఆల్ పార్టీ సమావేశానికి సంబంధించిన ఆహ్వన పత్రికలను అందించారు.

five parties to stay away from all-party meet called by Andhra govt on Special Category Status

అయితే ఆల్ పార్టీ మీటింగ్‌కు దూరంగా ఉంటామని ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ప్రకటించింది. ఢిల్లీ పరిణామాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తమకు ఆహ్వనం అందిందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చెప్పారు. అయితే ఢిల్లీ పరిణామాలపై ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, లెఫ్ట్ పార్టీలు కూడ ఈ అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉంటామని ప్రకటించాయి. ఈ సమావేశానికి తాము హజరుకాబోమని బిజెపి కూడ ప్రకటించింది. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ హజరు అవుతోందో లేదోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ప్రత్యేక హోదా విషయమై రాజకీయాలకు అతీతంగా తాము అన్ని పార్టీలను కలుపుకొని పోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.మంత్రులతో బిజెపి, వైసీపీ, జనసేన పార్టీలకు ఆహ్వనపత్రికలను పంపింది అయితే ఈ పార్టీలు ఆల్ పార్టీ మీటింగ్‌కు రాకుండా ఉండడం వల్ల రాజకీయ ప్రయోజనాలను ఆశించారని టిడిపి విమర్శలు ఎక్కు పెట్టే అవకాశం దక్కింది. ఆల్ పార్టీ సమావేశానికి రాకుండా విమర్శలు చేస్తే విపక్షాలపై ఎదురుదాడి చేసే అవకాశం టిడిపి నేతలకు దక్కిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రత్యేక హోదా విషయమై గతంలో కూడ అఖిలపక్ష సమావేశాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. ఆ సమావేశానికి లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీల నేతలు హజరయ్యారు. అప్పుడు కూడ జనసేన, బిజెపి, వైసీపీ నేతలు హజరుకాలేదు. ఈ దఫా కూడ ఈ మూడు పార్టీలతో పాటు లెఫ్ట్ పార్టీలు కూడ దూరంగా ఉంటామని ప్రకటించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+