కర్నూలు జిల్లాలో ఐదుగురు విద్యార్థినుల కిడ్నాప్..
కర్నూలు: జిల్లాలోని పత్తికొండలో ఐదుగురు విద్యార్థినుల కిడ్నాప్, బ్లేడ్లతో దాడి ఘటన సంచలనం సృష్టించింది. అయితే కిడ్నాపర్లు బాలికలను వదిలేసి వెళ్లడంతో పెద్ద ముప్పు తప్పింది.
పత్తికొండలోని బాలికల ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్ధినులను పాఠశాల సమీపంలోనే గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు.
కిడ్నాప్ చేసిన అనంతరం రెండు ఆటోల్లో ఈ విద్యార్ధినిలు ఇందూ, హైమావతి, ఆశ, పూజిత, మరో విద్యార్ధినిలను దుండగులు అక్కడ్నుంచి తరలించారు. అనంతరం విద్యార్ధినుల చేతులను బ్లేళ్లతో కోసి పత్తికొండ ఆస్పత్రి వద్ద వదిలేసి దుండగులు పరారైనట్లు బాలికలు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్ధినులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కిడ్నాప్ వ్యవహారం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. మరోవైపు ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి విచారణ జరిపిన అనంతరమే కిడ్నాప్ వెనుక రహస్యం బైటపడుతుందని పోలీసులు అంటున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications