టీడీపీ-బీజేపీ పొత్తుపై గుంటూరులో ఫ్లెక్సీ కలకలం!
Recommended Video

గుంటూరు: బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయంపై టీడీపీ నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది.
'బీజేపీతో టీడీపీ పొత్తు..ఇంటికి రాదు విత్తు ..మన గింజలు కూడా మనకు దక్కవు' అన్న నినాదంతో రాసిన ఫ్లెక్సీ ఎన్టీఆర్ స్టేడియం వద్ద దర్శనమిస్తోంది. టీడీపీ అభిమానుల పేరుతో వెలసిన ఈ ఫ్లెక్సీని గుంటూరు వాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి తక్కువ నిధులు కేటాయించారన్న చర్చకు ఈ ఫ్లెక్సీ అద్దం పడుతోంది. ఇప్పటికే బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ పలువురు రాజకీయనాయకులు, వామపక్షాలు రోడ్లపై నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా టీడీపీ అభిమానులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న టీడీపీ-బీజేపీ సంబంధాలు బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి చూపించడంతో మరింత దిగజారాయి. ఇప్పుడు ఆ చిచ్చును ఈ ఫ్లెక్సీ మరింత దూరం తీసుకెళ్లేలా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications