మోడీ స్వచ్ఛ భారత్, జగన్ ధర్నా ఫ్లెక్సీలు: వైసీపీ వర్సెస్ టీడీపీ

Flexi stir in Krishna district
విజయవాడ: కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని పోరంకిలో వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య ఫ్లెక్సీ గొడవ రాజుకుంది. తమ నాయకుడి ఫ్లెక్సీ చింపారని ఒక వర్గం, తమ నేత ఫ్లెక్సీనే చింపారని మరొక వర్గం తోపులాటకు దిగాయి.

శుక్రవారం నుంచి తాము తలపెట్టిన ధర్నాకు సంబంధించి ఆ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించివేసి, టీడీపీ నేతలు తమ ఫ్లెక్సీ కట్టుకున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి, వైసీపీ నేత కొలుసు పార్థసారథి వర్గీయులు గురువారం సాయంత్రం పెద్ద సంఖ్యలో రోడ్డుమీదకొచ్చారు.

అయితే స్వచ్ఛ భారత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కట్టారని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ వర్గీయులు ఆరోపించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో మొదలైన రగడ దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది.

మాజీ మంత్రి పార్థసారథిని పోలీసులు అదుపులోకి తీసుకుని కంకిపాడు తీసుకెళ్లి, విడిచిపెట్టారు. దీంతో పోరంకిలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, మరో పదిమంది తనను కులం పేరుతో దూషించి, చెయ్యి చేసుకున్నారని పార్థసారథి కారు డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మళ్లీ ఇరు వర్గీయులూ గొడవకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. సమాచారం తెలుసుకున్న డీసీపీ, ఏసీపీ పెనమలూరు స్టేషన్ వద్దకు చేరుకున్నారగు. పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అక్కడకు వచ్చారు. దీంతో, పారా మిలటరీ దళాలను రంగంలోకి దింపడంతో పరిస్థతి అదుపులోకి తెచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+