కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలు కల సాకారం -ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో సర్వీసులు ప్రారంభం -తొలి విమానానికి మంత్రుల స్వాగతం

|
Google Oneindia TeluguNews

కర్నూలు జిల్లా ప్రజల కల సాకారమైంది. కర్నూలు సిటీకి సమీపంలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో విమానాల సర్వీసులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్ పోర్టుగా సీఎం జగన్ నామకరణం చేసిన విమానాశ్రయానికి ఆదివారం తొలి విమానం రావడం, ఇదే రోజు మరో విమానం టేకాఫ్ తీసుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

viral video: బట్టలూడదీసి బీజేపీ ఎమ్మెల్యేపై రైతుల దాడి -సాగు చట్టాలపై పోరులో అనూహ్య ఘటన -ఖండనలుviral video: బట్టలూడదీసి బీజేపీ ఎమ్మెల్యేపై రైతుల దాడి -సాగు చట్టాలపై పోరులో అనూహ్య ఘటన -ఖండనలు

తొలి విమానానికి ఘన స్వాగతం..

తొలి విమానానికి ఘన స్వాగతం..

మార్చి 25వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్ కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేయగా, ఆదివారం (మార్చి 28) నాడు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. బెంగళూరు నుంచి తొలి ఇండిగో విమానం 52 మంది ప్రయాణికులతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఈ విమానానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని ఘన స్వాగతం పలికారు. అదే విమానం 72మంది ప్రయాణికులతో బెంగళూరుకు తిరుగు ప్రయాణమైంది. కాగా,

రాజధానుల మధ్య మరో విమానం

రాజధానుల మధ్య మరో విమానం

ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రభుత్వం ప్రకటించిన దరిమిలా రెండు రాజధానుల మధ్య తొలి విమాన సర్వీసు కూడా ఆదివారం మొదలైంది. నేటి ఉదయం 10:30కి ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖ వెళ్లే మొదటి విమానాన్ని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఇక మూడు నగరాలకు ఇండిగో సంస్థ విమానాలు నడపనుంది.

జగన్ మరో సంచలనం: రెస్కోలకు మంగళం -డిస్కాముల్లో విలీనం -కుప్పం రెస్కోపై చంద్రబాబు ఘాటు లేఖజగన్ మరో సంచలనం: రెస్కోలకు మంగళం -డిస్కాముల్లో విలీనం -కుప్పం రెస్కోపై చంద్రబాబు ఘాటు లేఖ

ఏపీ సర్కారు సొంతగా..

ఏపీ సర్కారు సొంతగా..

రాష్ట్రంలో ఆరో విమానాశ్రయం అయిన ఓర్వకల్లు విమానాయశ్రయ నిర్మాణాన్ని దాదాపు 18 నెలలోనే ప్రభుత్వం పూర్తిచేసింది. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మించగా.. దాదాపు 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో రన్‌వేను అభివృద్ధి చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్‌తో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును గత గురువారం సీఎం జగన్ ప్రారంభించారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం ప్రకటించారు.

English summary
Flight services at Orvakal Airport named as Uyyalawada Narasimha Reddy airport has started on Sunday. The first Indigo flight from Bangalore with 52 passengers arrived at Kurnool Airport. The flight was warmly welcomed by Ministers Buggana Rajendranath Reddy, Gummanoor Jayaram, Nandyala MP Brahmananda Reddy and MLA Katasani Rambhupal Reddy. The same flight returned to Bangalore with 72 passengers on board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X