జగన్ తో ప్లిప్ కార్ట్ సీఈవో భేటీ-ఏపీలో పెట్టుబడులకు హామీ-రేపు విశాఖకు సీఎం

ఏపీలో పెట్టుబడులకు మరో అంతర్జాతీయ బహుళజాతీయ సంస్ధ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్లిప్ కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. సీఎం జగన్ తో ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన కృష్ణమూర్తి.. పెట్టుబడులపై విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆయనకు విశాఖపై దృష్టిసారించాలని కోరారు. రేపు జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

 జగన్ తో ప్లిప్ కార్ట్ సీఈవో భేటీ

జగన్ తో ప్లిప్ కార్ట్ సీఈవో భేటీ

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ కృష్ణమూర్తి, కంపెనీ అత్యున్నతాధికారుల బృందం సీఎం వైయస్‌.జగన్‌తో ఇవాళ భేటీ అయ్యింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వీరు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, రైతులకు మంచి ధరలు అందేలా చూడ్డం, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ఇరువురి మధ్య విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు, పెట్టుబడుల అవకాశాలపై చర్చ జరిగింది.

 పెట్టుబడులు పెట్టాలని కోరిన జగన్

పెట్టుబడులు పెట్టాలని కోరిన జగన్

రాష్ట్రంలో వ్యవసాయరంగంలో విప్లవాత్మక చర్యగా ఆర్బీకేలను ప్రారంభించామని, రైతులకు విత్తనం అందించడం దగ్గరనుంచి వారి పంటల కొనుగోలు వరకూ ఆర్బీకేలు నిరంతరం వెన్నుదన్నుగా నిలుస్తాయని సీఎం ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓకు సీఎం జగన్ వివరించారు. రైతులకు పంటలకు మంచి ధరలు వచ్చేలా ఫ్లిప్‌ కార్ట్‌ దోహదపడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. వారి ఉత్పత్తులను కొనుగోలుచేసి వినియోగదారులకు అందించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. మంచి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంలో సహాయపడాలన్నారు. ఎప్పటికప్పుడు ధరల పర్యవేక్షణకు సీఎంయాప్‌ ఉందని, దాన్ని మరింత మెరుగుపరిచేందుకు తగిన తోడ్పాటు అందించాలని కూడా సీఎం కోరారు. రాష్ట్రంలో విశాఖపట్నం ఐటీ, ఇ-కామర్స్‌ పెట్టుబడులకు మంచి వేదిక అని, అక్కడ మరిన్ని పెట్టుబడులకు మందుకు రావాలని సీఎం ఫ్లిప్‌కార్ట్‌కు పిలుపునిచ్చారు. నైపుణ్యాలను మెరుగుపరచడానికి విశాఖలో హై ఎండ్‌ స్కిల్‌యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, దీంట్లో భాగస్వాములు కావాలన్నారు.

 సానుకూలంగా స్పందించిన ప్లిప్ కార్ట్ సీఈవో

సానుకూలంగా స్పందించిన ప్లిప్ కార్ట్ సీఈవో

తాము విస్తృతపరుస్తున్న సరుకుల వ్యాపారంలో రైతులనుంచి ఉత్పతులు కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. ఇది ఉభయులకు ప్రయోజనమన్నారు. మంచి టెక్నాలజీని అందించేలా తమ వంతు కృషిచేస్తామన్నారు. ముఖ్యమంత్రి పతిపాదనలపై ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ సానుకూలత వ్యక్తంచేశారు. విశాఖలో ఇప్పటికే తమ సంస్థవ్యాపారాలు చురుగ్గా సాగుతున్నాయని, మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతామన్నారు. వచ్చే ఏడాదినుంచే ఈ కార్యక్రమాలు మొదలవుతాయన్నారు. మత్స్య ఉత్పత్తులు రాష్ట్రంనుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని, ఈ వ్యాపారాన్ని మరింత పెంచేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సహాయపడాలని సీఎం విజ్ఞప్తిచేశారు. ఇప్పటికే తమ భాగస్వామ్య సంస్థ వాల్‌మార్ట్‌ ద్వారా రాష్ట్రంలో మత్స ఉత్పత్తుల కొనుగోలు, ఎగుమతి జరుగుతోందని, దీన్ని మరింతగా పెంచుతామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ తెలిపారు. సీఎం దార్శినికత బాగుందని, రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు ఆయన అంకితభావంతో ఉన్నారన్నారు. తన ఆలోచనలన్నీ పంచుకున్నారన్నారు.

 రేపు జగన్ వైజాగ్ టూర్

రేపు జగన్ వైజాగ్ టూర్

రేపు విశాఖపట్నంలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించబోతున్నారు. విశాఖ నగరంలో పలు అభివృద్ది ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవం, ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌లో సీఎం పాల్గొననున్నబోతున్నారు. సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి విశాఖ బయలుదేరనున్న సీఎం... 5.20 గంటలకు ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్, వీఎంఆర్‌డీఏ అభివృద్ది చేసిన మరో 6 ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు. 6.00 గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్‌ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్యా నాయుడు వివాహ ఫంక్షన్‌కు హాజరు కానున్నారు. 6.20 గంటలకు ఉడా పార్క్‌ వద్ద ఉడా పార్క్‌తో పాటు జీవీఎంసీ అభివృద్ది చేసిన మరో 4 ప్రాజెక్ట్‌లను సీఎం ప్రారంభించనున్నారు. సాయంత్రం 7 గంటలకు పీఎం పాలెం వైజాగ్‌ కన్వెన్షన్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరుకానున్నారు, అనంతరం రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి గన్నవరం తిరుగు పయనమవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+