ప్యాకేజీపై మోడీ ప్రకటన చేస్తారా?: డిమాండ్ ఏమిటి, ఆశిస్తుందేమిటి?

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలోని ఉద్ధండరాయనిపాలెంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆయన అమరావతికి శంకుస్థాపన చేస్తారు.

రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఏపీకి ఊరట లభించాలంటే ప్రత్యేక ప్యాకేజీతో పాటు ప్రత్యేక హోదా కూడా కావాల్సిందేనని అధికార, విపక్షాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి వచ్చే ప్రధాని మోడీ ఏం ఇస్తారనే చర్చ సాగుతోంది.

అమరావతి శంకుస్థాపన, దాని భవిత పైన ఉత్కంఠతో పాటు ప్రధాని ఏం ఇస్తారనే సస్పెన్స్ కూడా ఉంది. ప్రధాని ఏం ప్రకటిస్తారనే అంశం ఈ రోజు తేలిపోతుందని భావిస్తున్నారు. అయితే ప్రధాని మోడీ ఈ రోజు అంతగా ఆశించిన ప్రకటనలు చేయకపోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

Focus on Modi's package for AP

తాము ఏం ఇచ్చాం, అలాగే, చట్టంలో పేర్కొన్న వాటిని ఇస్తామని, రాష్ట్రానికి అండగా ఉంటామని చెప్పనున్నారని తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా వెనుక అనేక చిక్కులు ఉన్న విషయం తెలిసిందే. కనీసం ప్యాకేజీ అయినా ప్రకటిస్తారని అందరూ భావించారు.

కానీ, ఆ ప్యాకేజీ ప్రకటన కూడా రాకపోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. వాటి అమలు కోసం రోడ్ మ్యాప్ రూపొందించాల్సిన నీతి ఆయోగ్ అధికారులు ఇప్పటికీ తమ పూర్తి చేయలేదని సమాచారం. నీతి ఆయోగ్ అధికారులు ఇప్పటికీ తుది రూపు ఇవ్వలేదు. ఈ నివేదిక ఖరారయ్యేసరికి మరికొద్ది రోజులు పట్టవచ్చునని తెలుస్తోంది. ఈ కారణంగా ప్రధాని మోడీ భరోసా ప్రకటన మాత్రమే చేస్తారని తెలుస్తోంది.

ఏపీ డిమాండ్ ఏమిటి?

ప్రత్యేక హోదా
ప్రత్యేక ప్యాకేజీ.. బీహార్ ప్యాకేజీ కంటే ఎక్కువే ఇస్తారని ఆశిస్తోంది.
ప్రత్యేక రైల్వే జోన్
పలు రహదారులను జాతీయ రహదారులుగా చేయడం
కొత్త రాజధానికి ఆర్థిక సహకారం.
పారిశ్రామిక ప్రోత్సాహకాలు
190 కిలోమీటర్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు ఆర్థిక సాయం

Focus on Modi's package for AP

కనీసం ఇప్పుడు ఆశించేది ఏమిటి?

ప్రత్యేక ప్యాకేజీ
జాతీయ రహదారులు
డబుల్, ట్రిపుల్ రైల్వే ట్రాక్స్
పర్యాటక ప్రాజెక్టులు
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు ఆర్థిక సాయం
ప్రత్యేక హోదాపైన ఇప్పుడు ప్రకటన వస్తుందని మాత్రం ఎవరూ ఆశించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+