మనసులోమాట: పురంధేశ్వరి టిడిపిలోకి వెళ్తే బావుండు

దగ్గుబాటి పురంధేశ్వరి గురువారం ఉదయం విశాఖపట్నంలో కార్యకర్తలు, అనుచరులతో భేటీ అయ్యారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు తమ మనసులోని మాట చెప్పారు. పురంధేశ్వరి బిజెపిలోకి వెళ్లడం కన్నా టిడిపిలోకి వెళ్లాలని తాము కోరుకుంటున్నామన్నారు.
టిడిపి నుండే విశాఖ ఎంపీగా పోటీ చేయాలంటున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి వెళ్తే బాగుంటుందని తాము భావిస్తున్నామంటున్నారు. అయితే, ఆమె ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున తామ ఆమె వెంటే నడుస్తామని చెబుతున్నారు.
కాగా, పురంధేశ్వరి బిజెపిలో చేరాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు కార్యకర్తలతో భేటీ అవుతున్న ఆమె.. ఒకటి రెండు రోజుల్లో భారతీయ జనతా పార్టీ అగ్రనేతల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఆమె విశాఖ లేదా విజయవాడ నుండి పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications