టెక్కీ కూచిబొట్ల శ్రీనివాస్ భార్య సునయన: ట్రంప్ ఆహ్వనం, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గత ఏడాది అమెరికాలో చోటు చేసుకొన్న కాల్పుల ఘటనలో టెక్కీ కూచిబొట్ల శ్రీనివాస్ మరణించారు. అయితే కూచిబొట్ల శ్రీనివాస్ భార్య సునయనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వర్గానికి చెందిన ప్రతినిధి కెవిన్ యెడర్ నుండి సునయనకు ఆహ్వనం అందింది.

గత ఏడాది ఓ హోటల్ లో అమెరికాకు చెందిన ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో కూచిబొట్ల శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించాడు. శ్రీనివాస్ స్నేహితుడు ఈ ప్రమాదం నుండి తప్పించుకొన్నాడు.

శ్రీనివాస్ ను కాపాడేందుకు అమెరికన్ తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ఘటనలో ఆయన కూడ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో ఆ తర్వాత ఆయన కోలుకొన్నాడు.

కూచిబొట్ల శ్రీనివాస్ సతీమణి సునయనకు ట్రంప్ వర్గం నుండి ఆహ్వనం

కూచిబొట్ల శ్రీనివాస్ సతీమణి సునయనకు ట్రంప్ వర్గం నుండి ఆహ్వనం

గత ఏడాది అమెరికాలో జరిగిన కాల్పుల్లో కూచిబొట్ల శ్రీనివాస్ మరణించారు. అయితే ఈ నెల 30న, అమెరికాలో స్టేట్‌ ఆఫ్‌ యూనియన్‌ అడ్రెస్‌ కార్యక్రమంలో పాల్గొనాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వర్గానికి చెందిన ప్రతినిధి కెవిన్‌ యోడర్‌ కోరారు.

 అమెరికా పౌరసత్వాన్ని కోల్పోయిన సునయన

అమెరికా పౌరసత్వాన్ని కోల్పోయిన సునయన

అమెరికాలో గత ఏడాది జరిగిన కాల్పుల ఘటనలో కూచిబొట్ల శ్రీనివాస్ మరణించాడు. శ్రీనివాస్ మృతితో సునయన అమెరికా పౌరసత్వాన్ని కోల్పోయారు. అయితే శ్రీనివాస్ మరణించిన తర్వాత సునయన ఇటీవలనే అమెరికాకు వెళ్ళారు. అయితే వలసదారులపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొంటున్న నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమౌతున్న తరుణంలో సునయనను ఆహ్వనించడం ప్రాధాన్యత సంతరించుకొంది.

 వలసదారులకు మద్దతు

వలసదారులకు మద్దతు

అమెరికాలో ఉద్యోగం కోసం వచ్చే వలసదారులకు తాము పూర్తిగా మద్దతును ఇస్తామని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంకేతాలు ఇచ్చింది.భారతీయులతో పాటు ఇతర దేశాలకు చెందిన వలసదారులను ఆహ్వానించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలియజేయడానికే ఈ ఇమ్మిగ్రేషన్‌ విషయం గురించి ఇంతగా ఆలోచిస్తున్నట్టు ట్రంప్ ప్రతినిధి కెవిన్ తెలిపారు.

 అమెరికాలో సునయనకు పలువురి మద్దతు

అమెరికాలో సునయనకు పలువురి మద్దతు

అమెరికాలోని తన స్నేహితులు, కుటుంబీకుల నుంచి తనకు పూర్తి మద్దతు లభిస్తుందని కూచిబోట్ల సునయన తెలిపారు.ఈ విషయం తనకు చాలా సంతోషాన్ని ఇస్తోందని ఆమె చెప్పారు. కూచిబొట్ల వర్థంతి సందర్భంగా సునయన త్వరలో భారత్‌ రాబోతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sunayana Dumala, the wife of Indian techie Srinivas Kuchibhotla who was killed, has been invited to attend US President Donald Trump's maiden State of the Union address, a media report has said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి