తిరుమల శ్రీవారి సేవ కోసం.. టీటీడీపై పోరాడి గెలిచిన తెలంగాణా భక్తుడు

కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల పైన కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి , సేవ చేయడానికి చాలామంది పరితపిస్తూ ఉంటారు. ఇక అటువంటి ఓ కుటుంబం శ్రీవారి మేల్ చాట్, తిరుప్పావై సేవ కోసం 2008 నవంబర్ 26వ తేదీన టీటీడీకి 21,250 డిడి చెల్లించి నిరీక్షించాడు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టిటిడి పైన యుద్ధం ప్రకటించి స్వామివారి సేవ కోసం సుదీర్ఘ పోరాటమే చేశారు.

స్వామి వారి సేవ కోసం కుటుంబం పోరాటం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన చంద్రశేఖర్ దంపతులు వారి కుమారుడు, కోడలు, స్వామివారి మేల్ చాట్, తిరుప్పావై సేవ టికెట్ల కోసం దాదాపు 22 వేల రూపాయలను డిడి రూపంలో చెల్లించారు. సంవత్సరాలు గడిచిపోయిన స్వామివారి సేవకు వారికి అవకాశం దొరకలేదు. దీంతో చంద్రశేఖర్ టిటిడి పైన ఒత్తిడి తీసుకువచ్చారు. ఆపై 2021 సెప్టెంబర్ 10వ తేదీన వారికి సేవలో పాల్గొనడానికి టిటిడి అవకాశం కల్పించింది.

For Tirumala Srivari seva A Telangana devotee who fought and won against TTD

జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించిన బాధిత కుటుంబం
కోవిడ్ మహమ్మారి కారణంగా సేవలు రద్దుచేసి వారికి బ్రేక్ దర్శనం కల్పిస్తామని అప్పట్లో సమాచారం కూడా ఇచ్చింది. దీంతో చంద్రశేఖర్ మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. స్వామివారి సేవ కోసం అంత డబ్బు చెల్లించి దరఖాస్తు చేసుకుంటే, దానిని రద్దు చేసి బ్రేక్ దర్శనం కల్పిస్తామని చెప్పడం అన్యాయమని, తమకు స్వామివారి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వినియోగదారుల కమిషన్ న్యాయమూర్తి అనురాధ తీర్పు
లేనిపక్షంలో ఇంతకాలం తమ డబ్బులను సమయాన్ని వేస్ట్ చేసినందుకు టిటిడి 20 లక్షల రూపాయలు చెల్లించాలని ఆయన వినియోగదారుల కమీషన్ లో తనకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక 2024 మే 8వ తేదీన వినియోగదారుల కమిషన్ న్యాయమూర్తి అనురాధ చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు నాలుగు రోజులలో శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని లేనిపక్షంలో వారికి 20లక్షల రూపాయలను చెల్లించాలని టిటిడిని ఆదేశించారు.

జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశాలను సవాలు చేసిన టిటిడి
మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశాలను సవాలు చేసిన టిటిడి రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించింది. అయితే ఈ సమస్యను జిల్లా స్థాయిలోనే పరిష్కరించుకోవాలని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ సూచించడంతో మళ్లీ ఈనెల 15వ తేదీన దీనిపైన జిల్లా వినియోగదారుల కమిషన్ విచారణ చేపట్టి టిటిడి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

టీటీడీకి షాక్ .. వినియోగదారుల కమిషన్ ఆగ్రహం
తాము ఇచ్చిన తీర్పుకు కట్టుబడి శ్రీవారి సేవ భాగ్యం కలిగించాలని, అలా కాకపోతే భక్తులకు చెల్లించాల్సిన 20 లక్షలలో 50% డిపాజిట్ చేయాలని, లేదంటే జైలుకు వెళతారా? అంటూ ప్రశ్నించింది. దీంతో టిటిడి అధికారులు ఆగస్టు 14, 15 తేదీలలో స్వామివారి సేవ చేయడానికి అవకాశం కల్పిస్తూ చంద్రశేఖర్ కుటుంబానికి టికెట్లు జారీ చేసింది. దీంతో స్వామి సేవకు టిటిడి పైనే గెలిచిన చంద్రశేఖర్ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+