Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ కారు చక్రం కింద సింగయ్య - ఫోరెన్సిక్‌ సంచలన నివేదిక..!?

ఏపీ రాజకీయాల్లో సింగయ్య మరణం సంచలనంగా మారింది. పల్నాడు పర్యటన వేళ జగన్ కారు కింద పడి సింగయ్య మరణించారనే కేసు నమోదైంది. ఇందులో జగన్ ను ఏ-2గా పేర్కొన్నారు. ఈ కేసులో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. విచారణ వేళ తొందర పాటు చర్యలు వద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కీలక వ్యాఖ్యలు చేసింది. కాగా, ఈ కేసులో జగన్ కారు కింద సింగయ్య పడిన వీడియో పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో వీడియో పై ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిన నివేదిక కీలకంగా మారుతోంది.

కీలక మలుపు
జగన్ పల్నాడు పర్యటన వేళ ఆయన కారు కింద సింగయ్య పడినట్లుగా వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఈ వీడియో పైన వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. కాగా, ఈ కేసు లో జగన్ ను ఏ-2గా చేర్చారు. జగన్ ఈ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన హైకోర్టు లో విచారణ జరిగింది. ఆ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి ఆదేశాల వరకు జగన్ తో పాటుగా ఈ కేసులో ఉన్న వారిపై ఎలాంటి చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది. కాగా, విచారణ సమయంలో జగన్ తరపు న్యాయవాదులు.. తొలుత ఈ ప్రమాదానికి మరో వాహనం కారణమని.. ఆ తరువాత జగన్ వాహనమే కారణమని చెప్పిన అంశాన్ని కోర్టుకు వివరించారు.

forensic report becomes crucial in YS jagan s convoy singaiah accident case

ఫోరెన్సిక్ నివేదిక
కాగా, ప్రభుత్వ న్యాయవాదులు జగన్ పర్యటన పైన ఆంక్షలు ఉన్నా.. ఉల్లంఘించారని వాదనల్లో పేర్కొన్నారు. పూర్తి సాంకేతిక ఆధారాలు సమర్పించేందుకు.. ప్రభుత్వ న్యాయవాదులు సమయం కోరారు. దీంతో, జూలై 1వ తేదీకి ఈ కేసును కోర్టు వాయిదా వేసింది. ఇక.. ఇటు ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసులు కారు ఢీ కొట్టిన వీడియోను, పోలీసులు డ్రోన్‌ కెమెరా ద్వారా తీసిన వీడియో ఫుటేజీలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ఆ వీడియో చిత్రీకరించిన సెల్‌ఫోన్‌ ఐడీ, ఫోన్‌ ఉన్న లొకేషన్‌ సహా గుర్తించి అది ఒరిజినల్‌దేనని ఫోరెన్సిక్‌ అధికారులు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. మరో వైపు నిబంధనల ప్రకారం ఇప్పటికే పోలీసులు జగన్‌ కారుకు ఫిట్‌నెస్‌ పరీక్షలు జరిపించారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న దాదాపు పదిమంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు.

కోర్టులో విచారణ
జూలై 1న కోర్టులో జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ తదుపరి విచారణలో ఫోరెన్సిక్‌ నివేదికను కోర్టుకు పోలీసులు సమర్పించనున్నారు. కారు డ్రైవర్‌ రమణారెడ్డితో పాటు జగన్‌, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజని తదితరులను నిందితులుగా పేర్కొంటూ గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. కాగా,ప్రధాన నిందితుడు ఏఆర్‌ కానిేస్టబుల్‌, జగన్‌ కారు డ్రైవర్‌ రమణారెడ్డి విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. కారు చక్రం కింద వ్యక్తి పడిన విషయం తనకు కనిపించలేదని చెప్పినట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదిక.. విచారణ వేళ కోర్టు తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+