మాజీ మంత్రి సోమశేఖర్ మృతి, ప్రముఖుల సంతాపం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు సోమశేఖర్ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

సోమశేఖర్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన అనంతపురం జిల్లా లేపాక్షి మండలం దేమకేతపల్లిలో శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సోమశేఖర్ 1971 నుంచి 1976 వరకు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మంత్రి వర్గంలో పనిచేశారు. సోమశేఖర్ మృతిపట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications