అమరావతిలో ప్రధాని సభ వేళ జగన్ అనూహ్య నిర్ణయం..!!
అమరావతి లో కీలక ఘట్టం చోటు చేసుకుంటోంది. ప్రధాని మోదీ అమరావతి పనుల రీ లాంఛ్ కోసం వస్తున్న వేళ భారీ ఏర్పాట్లు చేసారు. పలు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేసేందుకు నిర్ణయించారు. ప్రధాని సభను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సభకు 14 మంది ప్రత్యేక అతిధులను ఆహ్వానించింది. మాజీ సీఎం జగన్ ను ఆహ్వానించారు. జగన్ ఈ సభకు హాజరు పైన సందిగ్ధత కొనసాగుతున్న వేళ.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇది రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతోంది.
ప్రధాని హాజరు వేళ
అమరావతిలో ఈ రోజు ప్రధాని పర్యటన కోసం సర్వం సిద్దమైంది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత అమరావతి పనుల రీ లాంఛ్ సభ ఏర్పాటు చేసారు. ప్రధాని మోదీ సభకు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. దాదాపు అయిదు లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా భారీ ఏర్పాట్లు చేసారు. సభకు వచ్చే వారికి ఎండ తీవ్రత కారణంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. భారీ పైలాన్ ను సిద్దం చేసారు. A ఆకారంలో పైలాన్ ను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. దీని ద్వారా అమరావతి పనులు తిరిగి అధికారికంగా ప్రారంభం కానున్నాయి.

జగన్ కు ఆహ్వానం
ప్రధాని హాజరవుతున్న ఈ సభకు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా పలువురు ప్రముఖులను ఆహ్వా నించింది. మాజీ సీఎం జగన్.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. ఇక.. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల దిశ గా నిర్ణయం తీసుకున్నారు. అమరావతిని శాసన రాజధానిగా పేర్కొన్నారు. అయితే, ఎన్నికల్లో ఓటమి తరువాత కూటమి ప్రభుత్వం అమరావతి మాత్రమే రాజధానిగా స్పష్టం చేస్తూ.. నిలిచిన పనులను తిరిగి ప్రారంభిస్తోంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కాగా, ఇక అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగేలా చట్ట భద్దత దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.
జగన్ నిర్ణయంతో
ఈ సమయంలో జగన్ హాజరు పైన రాజకీయంగా చర్చ జరిగింది. పార్టీలోనూ జగన్ అమరావతి సభకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది. జగన్ హాజరు కాక పోతే.. పార్టీ ప్రతినిధులను పంపాలనే అంశం పైన చర్చ జరిగింది. కాగా, ప్రతీ వారం బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లిలో మూడు రోజులు ఉండే జగన్.. శుక్రవారం తిరిగి బెంగళూరుకు వెళ్తున్నారు. కాగా, ఇప్పుడు జగన్ గురువారం తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయారు. తాజాగా అమరావతి టెండర్ల విషయంలోనూ అవినీతి జరుగుతోందని జగన్ ఆరోపించారు. సభకు హాజరు పైన పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన లేదు. ఇక, ఇప్పుడు అమరావతి సభకు హాజరు విషయం లో జగన్ నిర్ణయం రాజకీయంగా కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications