రామోజీ, ఆర్కేతో నడ్డా భేటీ - బీజేపీకి నష్టం, మాజీ సీఎస్ సంచలనం..!!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల రాజకీయం రాజుకుంది. తెలంగాణలో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీలో సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణ, ఏపీలో బీజేపీ కొత్త అంచనాలతో అడుగులు వేస్తోంది. ఈ సమయంలోనే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మీడియా సంస్థల అధినేతలు రామోజీ, ఆర్కేతో సమావేశమయ్యారు. ఈ భేటీలపైన మాజీ సీఎస్..బీజేపీ నేత ఐవైఆర్ చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

జేపీ నడ్డా భేటీలతో:తెలంగాణలో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ఏపీలో బీజేపీ మిత్రపక్షంగా ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పుడు టీడీపీతో జత కట్టారు. టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి జగన్ ను ఓడించాలని భావిస్తోంది. కానీ, బీజేపీ నుంచి ఈ విషయంలో ఇప్పటి వరకు స్పష్టత రావటం లేదు. పవన్ తాను టీడీపీతో పొత్తు ప్రకటన విషయం పైన బీజేపీకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Former CS IYR Tweet over JP Nadda meets Ramoji and RK Goes viral

ఈ సమయం లోనే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు, ఆంధ్రజ్యోతి సంస్థల అధిపతి ఆర్కేను కలిసారు. ఈ సమావేశాల పైన ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి..బీజేపీ నేత ఐవైఆర్‌ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేసారు.

ఐవైఆర్ వరుస ట్వీట్లు:జేపీ నడ్డా వరుసగా రమోజీ, ఆర్కేతో సమావేశం కావటం పైన ఐవైఆర్ వరుస ట్వీట్లు చేసారు. అందులో భాగంగా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి @BJP4India గురించి చిలవలు పలవలుగా అబద్ధాలతో కథనాలు అల్లి రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసిందని పెద్ద ఎత్తున విష పూరిత దుష్ప్రచారాన్ని సాగించిన మీడియా మొఘల్, మీడియా నవాబు, రామోజీ, ఆర్కే, గార్లు...

Former CS IYR Tweet over JP Nadda meets Ramoji and RK Goes viral

అంటూ రాసుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా మరో ట్వీట్ లో..వీరిరువురి మూలంగా అకారణంగా బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోలుకోలేని నష్టాన్ని చవిచూచింది. అయినా అవేవీ మనసులో పెట్టుకోకుండా సహృదయంతో ఆ ఇరువురిని కలిసిన @JPNadda గారు అభినందనీయులు. ఇకనైనా ఈ ఇరువురు వార్తలను వార్తలుగా అజెండా రహితంగా ప్రజలకు అందిస్తారని అందరం ఆశిద్దాం...అని పేర్కొన్నారు.

Former CS IYR Tweet over JP Nadda meets Ramoji and RK Goes viral

రాజకీయంగా చర్చ:ఐవైఆర్ రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు హయాంలో ఏపీ సీఎస్ గా పని చేసారు. గతంలో పలు సందర్భాల్లో అమరావతితో సహా ప్రభుత్వాల నిర్ణయాల పైన తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. బీజేపీలో కొనసాగుతున్నారు. అటు ఏపీ ప్రభుత్వం మార్గదర్శి వ్యవహారంలో రామోజీని విచారిస్తోంది. మరో వైపు స్కిల్ స్కాంలో చంద్రబాబు కోర్టు ఆదేశాలో రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు.

ఈ రెండు పత్రికలు టీడీపీకి అనుకూలమని వైసీపీ ఆరోపిస్తోంది. ఇక, ఎన్నికల రాజకీయం వేడెక్కుతున్న సమయంలో జేపీ నడ్డా ఈ ఇద్దరితో సమావేశం కావటం ఇప్పుడు చర్చగా మారుతోంది. ఈ భేటీల పైన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, దీని పైన బీజేపీ అధికారికంగా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+