మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు .. ఓ రేంజ్ లో ఆయన ఇచ్చిన సమాధానం ఇదే

ఎన్నికల ఫలితాల తరువాత సైలెంట్ అయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీని వీడి పవన్ కళ్యాణ్ కు షాకివ్వ‌బోతున్నారన్న వార్తల నేపధ్యంలో మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పందించారు. గత ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికి పరిమితమైన జ‌న‌సేనలో వుండ‌లేక బ‌య‌టికి వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారని వారిద్దరికీ మధ్య చాలా గ్యాప్ వచ్చిందని , అందుకే జనసేన పార్టీ ఇటీవల వేసిన కమిటీలలో లక్ష్మీ నారాయణకు స్థానం ఇవ్వలేదని జోరుగా ప్రచారం జరిగింది. జనసేన పార్టీ పట్ల మాజీ జేడీ లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని త్వేఅరలో బీజేపీలో చేరతారని కూడా వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు .

పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారం కేవలం రూమర్ అన్న లక్ష్మీ నారాయణ

పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారం కేవలం రూమర్ అన్న లక్ష్మీ నారాయణ

పవన్ కళ్యాణ్ పార్టీలోప్రభావం చూపించగల నేతగా ఉన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ వ్యవహారాల్లో పెద్దగా పాత్ర తీసుకోలేదు. అంతే కాక జనసేన పార్టీ కార్యకర్తలను తాను నిర్వహించే జేడీ ఫౌండేషన్ కార్యక్రమాలకు వాడుకుంటున్నారని పవన్ కు తెలిసిందని అందుకే పవన్ లక్ష్మీ నారాయణ పట్ల సైలెంట్ గా ఉంటున్నారని, ఇటీవల కమిటీలలో స్థానం కల్పించలేదని ప్రచారం జరిగింది. ఇక లక్ష్మీ నారాయణ సైతం పవన్ ను కలవాలంటే ఇబ్బంది పడుతున్నారని , సాధారణ కార్యకర్తలా పవన్ కోసం వెయిట్ చెయ్యాల్సి వస్తుందని అందుకే ఆయన పవన్ ను కనీసం కలవటానికి కూడా వెళ్ళటం లేదని పెద్ద చర్చ జరిగింది. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోవటంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టు జరిగిన ప్రచారం కేవలం రూమర్ అని ఆయన కొట్టి పారేశారు.

తనపై వస్తున్న వార్తలు నిరాధారమైనవన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

తనపై వస్తున్న వార్తలు నిరాధారమైనవన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

ఇప్పటికే చాలా రోజుల నుండి ఈ ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో సైలెంట్ గా ఉంటె నిజమని నమ్ముతారని భావించారో ఏమో గానీ ఎట్టకేలకు ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. తాను జనసేనను వీడట్లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పార్టీకి తన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ భావించినంత కాలం తాను జనసేనను వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక తనపై జరుగుతున్న ప్రచారం అంతా రూమర్ అని చెప్పిన మాజీ జేడీ తాను పార్టీ మారుతున్నట్లుగా వచ్చిన వార్తలన్నీ కూడా నిరాధారమైనవేనని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి బేస్ లెస్ వార్తలను వండివార్చే బదులు సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలంటూ ట్విట్టర్ వేదికగా ఆయన మండిపడ్డారు.

రూమర్స్ రాసినవాడు ఫూల్ - ప్రచారం చేసిన వారు మూర్ఖులు - నమ్మినవాడు ఇడియట్ అన్న లక్ష్మీ నారాయణ

రూమర్స్ రాసినవాడు ఫూల్ - ప్రచారం చేసిన వారు మూర్ఖులు - నమ్మినవాడు ఇడియట్ అన్న లక్ష్మీ నారాయణ

ఇక అంతే కాదు తనపై వస్తున్న వార్తలను చూసి షాక్ అయ్యానని ట్విట్టర్ వేదికగా చెప్పిన ఆయన ఒక నానుడి ఉంది రూమర్స్ గురించి అని చెప్తూ రూమర్స్ రాసినవాడు ఫూల్ - ప్రచారం చేసిన వారు మూర్ఖులు - నమ్మినవాడు ఇడియట్ అని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి ఆయన పార్టీ మారతారని జరిగిన ప్రచారం కేవలం రూమర్ అని ఆయన తేల్చి పారేశారు. అంతే కాదు ఇలా రూమర్లు ప్రచారం చెయ్యటం కంటే వరద బాధితులకు సహాయం చెయ్యమన్నారు. వర్షాకాలం మొక్కలు నాతాలని సూచించారు. ఇక ప్లసిక్ ను నిర్మూలించటానికి పని చెయ్యాలని, యువతను దేశ ప్రగతిలో పాలు పంచుకునేలా ప్రోత్సహించాలని ఆయన ట్విట్టర్ వేదికగా కోరారు. దీంతో జనసేన పార్టీలో, జనసైన్యంలో మాజీ జేడీ విషయంలో జరుగుతున్న చర్చకు, సందిగ్ధ పరిస్థితికి లక్ష్మీనారాయణ తాను ఇచ్చిన క్లారిటీతో ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+