• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ దుష్ట చతుష్టయం చేసిన పనే ఇది.. అందుకే ఏపీలో ఇసుక కొరత అన్న దేవినేని ఉమ

|

ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడుతుంది. ఇసుక పాలసీ విషయంలో అసహనం వ్యక్తం చేస్తుంది. రాష్ట్రంలో నిర్మాణ రంగ కార్మికులు పస్తులుంటున్నారని పేర్కొంది. అయినా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఇసుక కొరతకు కారణం వైసీపీలో ఉన్న ఆ నలుగురు దుష్ట చతుష్టయం అని ఇసుక కొరతపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరావు వైసీపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు .

చంద్రబాబు పాలిచ్చే ఆవు కాదు.. ఎలుగుబంటి పాలన.. వైసీపీ నేతల సెటైర్లు..!

వైసీపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నీ వసూళ్ళ కోసమే అన్న దేవినేని ఉమా

వైసీపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నీ వసూళ్ళ కోసమే అన్న దేవినేని ఉమా

విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఉచిత ఇసుకను రద్దు చేసి.. కొత్త విధానం అమల్లోకి వచ్చేలాగా చేసి వైసీపీ నేతలు, కార్యకర్తలను కుబేరులను చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం వుందని ఉమా ఆరోపించారు. లేకుంటే నిర్మాణ రంగం కుదేలవుతున్నా ప్రభుత్వానికి పట్టదా అని ఆయన ప్రశ్నించారు. ఇక ఇసుక కొరతకు కారణం వైసీపీ అవినీతి అని ఆరోపించారు దేవినేని ఉమా. సిమెంట్ కంపెనీలు బస్తాకు రూ. 5 ఇవ్వలేదని కోపంతోనే జగన్ రాష్ట్ర ప్రజలకు ఇసుకను అందుబాటులో లేకుండా చేశారని ఆరోపణలు చేసిన మాజీ మంత్రి దేవేనేని వైసీపీలో చతుష్టయంగా పేరుబడ్డ సజ్జల రామకృష్ణా రెడ్డి , గంగిరెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి సిమెంట్ కంపెనీలను డిమాండ్ చేయడం నిజం కాదా అని ఉమా వారిని నిలదీశారు .ఇది వారు చేసిన నిర్వాకం కాదా అని ప్రశ్నించారు.

మీ సేవ కేంద్రాలకు మంగళం పాడాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి

మీ సేవ కేంద్రాలకు మంగళం పాడాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి

ఇక రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది అని చెప్పిన దేవినేని ఉమా వైసీపీ ప్రభుత్వం త్వరలో మీ సేవ కేంద్రాలకు కూడా మంగళం పాడాలని చూస్తోందని ఆరోపించారు. తమ కార్యకర్తలకు గ్రామ వాలంటీర్లు గా ఉద్యోగాలు కల్పించి , మీ సేవా కేంద్రాలను మూసివేయటం ద్వారా మీ సేవ ద్వారా చేసే పనులను గ్రామ వాలంటీర్లు చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులు ఆందోళన బాట పట్టారని చెప్పిన దేవినేని ఉమా .. వారి భవిష్యత్తు ప్రమాదంలో పడిందని చెప్పారు. ఒకపక్క ఆందోళనలు చేస్తున్నా జగన్ ఎందుకు స్పందించడం లేదని ఉమా ప్రశ్నించారు.

అన్నింటా రాష్ట్రంలో పక్షపాత ధోరణి .. స్వలాభం కోసమే జగన్ నిర్ణయాలు

అన్నింటా రాష్ట్రంలో పక్షపాత ధోరణి .. స్వలాభం కోసమే జగన్ నిర్ణయాలు

అంతే కాదు జగన్ సర్కార్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వసూళ్ళ దందా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక గ్రామీణ స్థాయిలో రైతులకు సేవలందించే సహకార వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దేవినేని ఉమా ఆరోపించారు. పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన తర్వాత, ఎన్నికలు నిర్వహించడమో లేదంటే అంతకు ముందున్న సంఘాలను కొనసాగించడమో చేయాలని చెప్పారు. అలా కాకుండా వైసీపీకి చెందిన కమిటీలకు బాధ్యతను అప్పగించడం సరికాదన్నారు. రాష్ట్రంలో పక్షపాత ధోరణి రాజ్యమేలుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక గోశాలలో 105 ఆవులు మరణించటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన దేవినేని ఉమా విచారణ జరిపించాలని పశుసంవర్ధక శాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఏది ఏమైనా వైసీపీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక వైసీపీ స్వలాభం చూసుకునే ఇదంతా చేస్తుందని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

English summary
TDP is severely burned over the shortage of sand in AP. Sand expresses embarrassment at the policy. The construction workers in the state are starving. Yet the government is outraged that there is no motion. Former minister and TDP leader Devineni Umamaheswara Rao has made sensational allegations against the YSP leaders that sand shortage is the cause of the four quadruplets in YCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X