జగన్ కు ఓటేసినందుకు మాజీ మినిస్టర్ రవీంద్ర రెడ్డి పశ్చాత్తాపం-చంద్రబాబు అరెస్టు,రిమాండా ?
ఏపీలో తాజాగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి స్పందించారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు, రిమాండ్ పై డీఎల్ తీవ్రంగా స్పందించారు. అలాగే గతంలో 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ కు ఓటేసినందుకు ఆయన తన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లా మైదుకూరు నుంచి తిరిగి పోటీకి సిద్దమవుతున్న డీఎల్.. తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
మైదుకూరులో ఇవాళ మీడియాతో మాట్లాడిన డీఎల్ రవీంద్రారెడ్డి చంద్రబాబు అరెస్టు సహా తాజా పరిణామాలపై స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గమని డీఎల్ ఆరోపించారు. అలాగే ఆయన్ను రిమాండ్ కు పంపడాన్నీ తప్పుబట్టారు. స్కిల్ స్కాంలో చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన 28 పేజీల నివేదికలో ఎక్కడా ఆయన తప్పు చేసినట్లు లేదన్నారు. అయినా సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్ కు పంపిందన్నారు.

చంద్రబాబు అరెస్టుపై మాట్లాడుతూ.. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఎక్కడికీ పారిపోరని డీఎల్ తెలిపారు. చంద్రబాబు ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరించే వ్యక్తి అన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత అక్కడి కోర్టులోనే ఎందుకు ప్రవేశపెట్టలేదని డీఎల్ ప్రశ్నించారు. జగన్ కు గతంలో ఓటేసినందుకు తన చెప్పుతో కొట్టుకోవాల్సిన పరిస్దితి తలెత్తిందన్నారు.
మరోవైపు మైదుకూరులో గతంలో పలుమార్లు గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన డీఎల్ .. కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు. అప్పట్లో జగన్ ను కూడా తీవ్రంగా విమర్శించిన డీఎల్.. ఉన్నట్లుండి గత ఎన్నికల సమయంలో జగన్ కు మద్దతుగా నిలిచారు. ఈసారి ఎన్నికల్లో తిరిగి మైదుకూరు నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న డీఎల్.. తాజాగా చంద్రబాబుకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం విశేషం.












Click it and Unblock the Notifications