జనసేనలోకి చంద్రబాబు సన్నిహిత నేత..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమిలో కొనసాగుతూనే రాజకీయంగా బలం పెంచుకోవటం పైన జనసేన, బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. వైసీపీ ఎన్నికల్లో ఓడిన తరువాత పలువురు నేతలు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. మార్చి 14న పిఠాపురంలో జనసేన ప్లీనరీ నిర్వహించనున్నారు. ప్లీనరీ వేళ పలువురు నేతలు జనసేన లో చేరేందుకు రంగం సిద్దం అయింది. ప్రకాశం జిల్లా నుంచి గతంలో చంద్రబాబు మంత్రివర్గంలో పని చేసిన సీనియర్ నేత ఇప్పుడు జనసేనలో చేరేందుకు రంగం సిద్దమైంది.

జనసేనలోకి కీలక నేత
2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిన తరువాత పలువురు ముఖ్య నేతలు పార్టీ వీడారు. తమ రాజకీయ భవిష్యత్ కోసం కూటమి పార్టీల్లో చేరుతున్నారు. జగన్ బంధువు.. వైసీపీలో ముఖ్య నేతగా వ్యవహ రించిన బాలినేని ఇప్పుడు ప్రకాశంలో తన బలం నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అం దులో భాగంగా ప్రకాశం జిల్లాలో వైసీపీలో కీలకంగా పని చేసిన నేతలను జనసేనలోకి తీసుకొచ్చే వ్యూహాలు అమలు చేస్తున్నారు. తాజాగా ఒంగోలుకు చెందిన వైసీపీ కార్పోరేటర్లను జనసేనలో చేర్పించటంలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ముఖ్య నేతల పై ఫోకస్ చేసారు.

Former minister from Prakasam Dist to join in Janasena Soon

టీడీపీ టు జనసేన
ప్రకాశం జిల్లాలో టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేసిన నేత సిద్దా రాఘవరావు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడుగానూ పని చేసారు. 2014 లో దర్శి నుంచి గెలిచి చంద్రబాబు ప్రభుత్వం రవాణా శాఖ మంత్రిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరు వాత సిద్దా ఆ పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో సిద్దా దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, అక్కడ బూచేపల్లి ఉండటంతో సీటు దక్కలేదు.

ప్లీనరీ వేదికగా
ఇక, 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సిద్దా రాఘవరావు వైసీపీకి రాజీ నామా చేసారు. తిరిగి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. చంద్రబాబుతో సిద్దాకు మంచి సాన్నిహిత్యం ఉంది. జిల్లాకు చెందిన టీడీపీ నేతలు తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు చేసిన ప్రయ త్నాలు ఫలించలేదు. ఇప్పుడు బాలినేని శ్రీనివాస రెడ్డి తాజాగా సిద్దా రాఘవరావును జనసేనలోకి తీసుకెళ్లేందుకు పవన్ తో చర్చించినట్లు సమాచారం. సిద్దాం సైతం జనసేనలో చేరేందుకు వచ్చే నెల 14న ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. పిఠాపురంలో జరిగే జనసేన ప్లీనరీ వేదికగా సిద్దా జనసేన కండువా కప్పుకోవటం లాంఛనంగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+