బటన్ నొక్కడం చేతకావట్లేదేటి?

Chandrababu: గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, సూపర్ 6 గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలను ఇప్పట్లో అమలు చేయలేమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఘాటుగా స్పందిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతోంది.

హామీల అమలు విషయంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. వంచనకు పాల్పడ్డారంటూ విమర్శనాస్త్రాలను సంధిస్తోంది. ఎంతో రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొంటోన్న చంద్రబాబు- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అంచనా వేయకుండానే హామీలు ఇచ్చారా? అంటూ నిలదీస్తోంది.

Former Minister Gudivada Amarnath key remarks against CM Chandrababu

తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడారు. హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి గురించి చంద్ర‌బాబుకు తెలియ‌దా అంటూ ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో సూప‌ర్ 6 హామీలు అంటూ ఊద‌ర‌గొట్టి..ఇవాళ ఆర్థిక ప‌రిస్థితి బాగోలేద‌ని త‌ప్పించుకోవ‌డం దారుణ‌మ‌ని అన్నారు.

కొద్దిసేపటి కిందటే ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, వారికి మేలు కలిగించే సంక్షేమ పథకాల అమలు తీరు పట్ల చంద్ర‌బాబు నిజస్వరూపం బయటపడిందని, ఆయనకు ఉన్న విశ్వసనీయత ఏమిటో ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని విజ్ఞప్తి చేశారు. ఎన్నిక‌ల హామీల గురించి ప్ర‌శ్నిస్తే ఆర్థిక ఇబ్బందులు అనే పాట అందుకుంటోన్నాడని గుడివాడ అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు.

ఇదే చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్- గతంలో హామీల అమలు విషయంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఉద్దేశించి ఎన్నో విమర్శలు గుప్పించారని గుర్తు చేశారు. ఇంట్లో కూర్చోని బ‌ట‌న్లు నొక్కుతున్నాడని, రాష్ట్రాన్ని శ్రీ‌లంక చేశాడంటూ హేళ‌న‌గా మాట్లాడారని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల రూపాయలు ఎక్క‌డికెళ్లాయో తెలియట్లేదంటూ చంద్ర‌బాబు మాట్లాడటం విచిత్రంగా ఉందని గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. బటన్ నొక్కడం ద్వారా జ‌గ‌న్ 2.73 ల‌క్ష‌ల కోట్ల రూపాయలను నేరుగా అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారని వివరించారు. ఆ డ‌బ్బు ప్ర‌జ‌ల వ‌ద్దే ఉంద‌ని చెప్పారు.

రాష్ట్రంలో కొత్త‌గా క‌ట్టిన‌ మెడిక‌ల్ కాలేజీలు, స్కూల్ భ‌వ‌నాలు, స‌చివాల‌యాలు, ఇరిగేష‌న్‌ ప్రాజెక్టుల‌కు ఖ‌ర్చు చేసిన లెక్క‌లు చాలా క్లియ‌ర్‌గా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఆ రోజు చంద్ర‌బాబు సంప‌ద సృష్టిస్తాన‌ని మాటిచ్చారని, అధికారంలోకి వ‌చ్చాక‌ కూట‌మి ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు బాబు సంప‌ద సృష్టిస్తున్నారని విమర్శించారు.

స్వర్ణాంధ్ర విజ‌న్ 2047 పేరుతో ఇప్పుడు జనం ముందుకు వచ్చి చంద్రబాబు కొత్త నాటకం ఆడుతున్నాడని గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. 2047 వరకూ ప్ర‌జ‌లు సంక్షేమ పథకాల కోసం ఎదురు చూడాలా? అని ప్ర‌శ్నించారు. ఇచ్చిన హామీలు నిల‌బెట్టుకునే అల‌వాటు చంద్ర‌బాబుకు ఎప్పుడూ లేదని చెప్పారు. హామీలు అమ‌లు చేయ‌క‌పోతే ప్ర‌జ‌ల‌తో క‌లిసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+