చంద్రబాబు పబ్లిసిటీ కోసం 300 కోట్లు ఖర్చు - మాజీ మంత్రి గుడివాడ
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చంద్రబాబు తమ పబ్లిసిటీ కోసం వాడుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిప్పులు చెరిగారు. 300 కోట్లు ఖర్చు పెట్.. గిరిజన విద్యార్ధులని వందల కిలోమీటర్ల నుంచి బస్సుల్లో తీసుకొచ్చి తిండీ, నీళ్లూ కూడా సరిగ్గా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాట్స్, షెడ్స్, టాయిలెట్లు, తాగునీరు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేవని అన్నారు. ఇది యోగా కాదు - యోగా పేరుతో డ్రామా" అని ఆరోపించారు.
అంతే కాకుండా ఉత్తరాంధ్రకు కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై ఒక్క నిర్ణయం తీసుకోకపోవడం దారుణమని వాపోయారు. ఎత్తిపోతల ప్రాజెక్టులు, రహదారి విస్తరణలు, రైల్వే జోన్, ఎలక్ట్రిక్ బస్సులు వంటి హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని వ్యాఖ్యానించారు. ప్రజలు హామీల అమలుపై ప్రశ్నిస్తే.. తన దౌర్భాగ్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు.

విద్యార్థుల పక్షంగా, హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ యువత పోరాటం చేపడుతుందన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదని.. యువతను మోసం చేశారని అన్నారు. కానీ తమ ప్రభుత్వం హయాంలో యువతకు 2.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు.
విశాఖకు ప్రధాని మోడీని పిలిచి పెద్ద డ్రామా ఆడారన్నారు. కానీ దాని వల్ల ఉత్తరాంధ్రకు ప్రయోజనం ఏమీలేదని.. కేంద్రం నుంచి గెజిటెడ్ రైల్వే జోన్‌ను తీసుకురాలేకపోయారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. ఇప్పటి వరకే వేల కోట్ల అప్పులు తీసుకొని.. ఒక్క అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించలేదని విమర్శలు గుప్పించారు. తక్కువ కాలంలో ఎక్కువ అప్పులు చేసి.. ఆ డబ్బుతో ప్రచారం మాత్రమే చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
మా ఉత్తరాంధ్ర విశాఖ ప్రజలు అమాయకులు. యోగాంధ్ర లాంటి ఒక్క కార్యక్రమం పెడితే పొంగిపోతారు. ఏడాదికాలంగా @ncbn ఉత్తరాంధ్రకి ఏం చేశాడు? ఉత్తరాంధ్రకి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది మా ప్రభుత్వ హయాంలోనే.
— YSR Congress Party (@YSRCParty) June 22, 2025
-గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు… pic.twitter.com/nfF3rplu6l
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications