• search

జనసేనలో ముత్తాకు కీలక పదవి!: ఆ ఇంగ్లీష్ ఛానల్ షోలో హోస్ట్‌గా పవన్ కళ్యాణ్

By Srinivas
Subscribe to Oneindia Telugu
For amaravati Updates
Allow Notification
For Daily Alerts
Keep youself updated with latest
amaravati News
   జనసేనలో చేరనున్న ముత్తా గోపాలకృష్ణ

   అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీ మంత్రి, ఇండస్ట్రియలిస్ట్ ముత్తా గోపాలకృష్ణ ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాదులోని జనసేన కార్యాలయంలో పార్టీ అధినేతతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్టీలో చేరిక తదితర అంశాలపై మాట్లాడుకున్నారు.

   పవన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించగా, ముత్తా గోపాలకృష్ణ అంగీకరిచారు. అయితే పార్టీలో ఎప్పుడు చేరుతారనేది త్వరలో తెలియజేయనున్నారు. ఆయన రాకతో తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ మరింత బలోపేతమవుతుందని పవన్ భావిస్తున్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో కూడా ముత్తాకు ప్రత్యేక స్థానం కల్పించనున్నారని తెలుస్తోంది.

   కేంద్రమంత్రికి ప్రత్యేక సెగ: టీడీపీ ఎంపీల నిలదీత, జవదేకర్ గట్టి కౌంటర్

   ఆ ఛానల్లో హోస్ట్‌గా పవన్ కళ్యాణ్

   ఆ ఛానల్లో హోస్ట్‌గా పవన్ కళ్యాణ్

   ముత్తా గోపాలకృష్ణ తన కుమారుడు శశిధర్‌తో కలిసి త్వరలో జనసేనలో చేరనున్నారు. తన ఇద్దరు కుమారులు ముత్తా శశిధర్‌, ముత్తా గౌతమ్‌లతో కలిసి కార్యాలయంలో పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరాలని ఆయనకు పవన్‌ ఆహ్వానం పలికారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో స్థానం కల్పిస్తామన్నారు. పవన్‌తో భేటీ అనంతరం ముత్తా గోపాలకృష్ణ మాట్లాడుతూ.. తన కొడుకు ముత్తా గౌతమ్‌ ఆధ్వర్యంలో ప్రారంభించబోయే ఇండియా ఏ హెడ్‌ ఆంగ్ల న్యూస్‌ ఛానెల్‌లో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేశామని, అందులో హోస్ట్‌గా చేయాలని పవన్‌ను కోరినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే ఈ టీవీషోలో తాను హోస్ట్‌గా చేస్తానని పవన్‌ చెప్పారన్నారు.

   ఫిన్లాండ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి

   ఫిన్లాండ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి

   జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీతో భేటీ అయ్యారు. ఈ నెల 14వ తేదీన పార్టీ ఎన్నికల ముందస్తు ప్రణాళికను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థపై పార్టీ విధానాల కమిటీ రూపొందించిన ముసాయిదా పత్రంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. ఫిన్లాండ్‌లో విజయవంతమైన కొన్ని విద్యావిధానాలను స్ఫూర్తిగా తీసుకుని వాటిని ఏపీలో దశలవారీగా ఎంతవరకూ అమలు చేయవచ్చో అధ్యయనం చేయాలని పార్టీ విధానాల రూపకల్పన కమిటీకి సూచించారు.

   ఇదీ జనసేన లక్ష్యం

   ఇదీ జనసేన లక్ష్యం

   జనసేన ఆశయం మంచి విద్యను అందించడమని పవన్ చెప్పారు. హాస్టల్స్, పాఠశాలలో నాణ్యత ప్రమాణాలు పెంచుతామన్నారు. హాస్టళ్లలోని విద్యార్థిని, విద్యార్థులకు శుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందించడం, సరైన గాలి, వెలుతురు వచ్చే విధంగా హాస్టల్ గదులు ఉండేలా చూడటం, బాలికల వసతి గృహాలకు సరైన రక్షణ కల్పించడం వంటి అంశాలు ఎన్నికల ప్రణాళికలో చేర్చాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలు, మైనార్టీల పిల్లలకు హాస్టళ్లను ఏర్పాటు చేసేలా జనసేన మ్యానిఫెస్టో ఉండాలన్నారు. అరకు, పాడేరు ప్రాంతాల్లోని బాలికల హాస్టల్, పాఠశాలలను సందర్శించినప్పుడు తనకు ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా పవన్ వివరించారు.

   కమిటీల నియామకం

   కమిటీల నియామకం


   రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంస్థాగత నిర్మాణ కమిటీలను నియమించారు. ప్రతి జిల్లా కమిటీకి ఒక సమన్వయకర్త, ఇద్దరు సంయుక్త సమన్వయకర్తలను నియమించారు. విశాఖపట్నం జిల్లాకు సంయుక్త సమన్వయకర్తలుగా నలుగురిని నియమించారు. ప్రతి జిల్లాకు 25 మందితో సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేశారు. మిగతా జిల్లాలకు త్వరలోనే కమిటీలు నియమించనున్నారు. ఈ అన్ని జిల్లాలకు సమన్వయకర్తగా పార్థసారధి వ్యవహరిస్తారు. ప్రాంతీయ సమన్వయకర్తలుగా ఉత్తరాంధ్రకు యువ పారిశ్రామికవేత్త డాక్టర్‌ శ్రీను బాబు, ఉభయగోదావరికి తులసీరావు, కృష్ణాకు ముత్తంశెట్టి కృష్ణారావు, గుంటూరుకు బైరా దిలీప్‌లను నియమించారు.

   మరిన్ని అమరావతి వార్తలుView All

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   Former Minister Mutha Gopalakrishna expressed his inclination to join the Jana Sena Party (JSP) during his interaction with its president Pawan Kalyan in Hyderabad on Sunday. Mr. Gopalakrishna met Mr. Kalyan to invite him for an event being organised by India Ahead, an English news channel being set up by his son Gautam, a JSP release said.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   Notification Settings X
   Time Settings
   Done
   Clear Notification X
   Do you want to clear all the notifications from your inbox?
   Settings X
   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more