మాజీమంత్రి, వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూత, అనారోగ్యంతో ఆస్పత్రిలో మృతి..
మాజీ మంత్రి, వైసీపీ నేత ఖలీల్ బాషా చనిపోయారు. గత కొన్నిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఖలీల్ బాషా మరణంతో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు బోరున విలపిస్తున్నారు. బాషా అంత్యక్రియలు బుధవారం కడప జిల్లాలో నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు.

టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మైనార్టీ శాఖ మంత్రిగా ఖలీల్ బాషా పనిచేశారు. గతేడాది ఫిబ్రవరి 5వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఖలీల్ బాషా మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications