ఆదితో విబేధాలు: సుజనా-సోమిరెడ్డిలు ఫోన్ చేసినా తగ్గని రామసుబ్బారెడ్డి, అంతలోనే ఇలా...
కేంద్ర మంత్రి సుజనా చౌదరి, కడప జిల్లా ఇన్ ఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు ఫోన్ లుచేసినా తాను మహానాడుకు హజరుకాబోనని మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి తేల్చి చెప్పారని ఆయన సన్నిహితులు చెబుతున
అమరావతి: కేంద్ర మంత్రి సుజనా చౌదరి, కడప జిల్లా ఇన్ ఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు ఫోన్ లుచేసినా తాను మహానాడుకు హజరుకాబోనని మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి తేల్చి చెప్పారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.అయితే పార్టీని వీడబోనని ఆయన స్పష్టం చేశారు. ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకోవడంతో పాటు మంత్రి పదవి ఇవ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు.ఈ కారణంగానే ఆయన మహానాడుకు దూరంగా ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి, మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయరెడ్డి కుటుంబాలకు మధ్య ఏళ్ళనుండి ఫ్యాక్షన్ గొడవలున్నాయి.ఈ రెండు కుటుంబాల ఆధిపత్య పోరులో అనేక మంది మరణించారు.
ఆదినారాయణరెడ్డి తండ్రితో పాటు, పి.రామసుబ్బారెడ్డి బాబాయ్, ఆయన సోదరుడు హత్యలకు గురయ్యారు.వీరితో పాటు ఈ రెండు వర్గాలకు చెందిన పలువురు హత్యలకు గురయ్యారు. అంతేకాదు అనేక కేసులు కూడ రెండు వర్గాలపై ఉన్నాయి.
ఆదినారాయణరెడ్డి ఆనాటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పి.రామసుబ్బారెడ్డి కుటుంబం టిడిపిలో ఉంది. అయితే కాంగ్రెస్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి టిడిపిలో చేరారు ఆదినారాయణరెడ్డి. పార్టీ అవసరాల రీత్యా ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేర్చుకొన్నారు చంద్రబాబునాయుడు.అయితే ఆదినారాయణరెడ్డి చేరికను పి.రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.పైగా ఆయనకు మంత్రిపదవిని ఇవ్వడంతో పార్టీ తీరుపై మనస్థాపానికి గురయ్యారు.ఆదివారం నాడు ఆయన తన అనుచరులతో జమ్మలమడుగులో సమావేశమయ్యారు.

ఇష్టంలేకే మహానాడుకు దూరం
జమ్మలమడుగు నియోజకవర్గంలో 9 నెలలుగా చోటుచేసుకొన్న పరిస్థితులను గమనిస్తున్నాను. ఈ కాలంలో పార్టీ వ్యవహరించిన తీరుతో మనస్థాపానికి గురైనట్టు రామసుబ్బారెడ్డి తన అనుచరుల వద్ద తన మనోవేదనను వ్యక్తం చేసినట్టు సమాచారం.ఈ కారణాలతోనే మహానాడుకు వెళ్ళడానికి మనసు ఒప్పుకోలేదన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను పార్టీ గమనించాలని ఆయన గుర్తుచేశారు.ఈ విషయాలను లోకేష్ పరిశీలించాలని ఆయన కోరారు. ఆస్తులు, ఊర్లు వదిలి కష్టనష్టాలకు గురై జైళ్ళకు వెళ్ళి వచ్చినవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి న్యాయం జరగలేదని రామసుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

సుజనా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు రామసుబ్బారెడ్డికి ఫోన్
మహనాడుకు దూరంగా ఉండడమే కాకుండా తన అనుచరులతో ఆదివారం నాడు సమావేశమైన రామసుబ్బారెడ్డితో టిడిపి నాయకులు ఫోన్ లో మాట్లాడారు. అనుచరులతో సమావేశానికి ముందుగా వారు రామసుబ్బారెడ్డితో మాట్లాడారు. మహనాడుకు హజరుకావాలని రామసుబ్బారెడ్డిని వారిద్దరూ కోరారు. అయితే జమ్మలమడుగులో నెలకొన్న పరిస్థితులను ఆయన పార్టీ నేతలకు వివరించారు.ఈ కారణాలను వివరించారు. ఆదినారాయణరెడ్డి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, తొలి నుండి పార్టీలో ఉన్నవారికి ఏ రకంగా అన్యాయం జరిగిందనే విషయాలను ఆయన ప్రస్తావించారు.ఈ కారణాలను చూపుతూ మహనాడుకు హజరుకాలేనని ఆయన చెప్పారు.అయితే పార్టీని వీడబోనని ఆయన చెప్పుకొచ్చారు.

కార్యకర్తలకు న్యాయం జరగడం లేదు
జమ్మలమడుగులో ఆనాటి నుండి పార్టీ జెండాను మోసిన తన వర్గీయులకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోవడం, ఆది వర్గీయులకు ప్రాధాన్యత పెరగడం వంటి పరిణామాలను కార్యకర్తల సమావేశంలో చర్చించారు.పలు పనులకు అడ్డంకులు ఎదురుకావడం వంటి సమస్యలపై చర్చించారు.ఈ విషయాలను పార్టీ సీనియర్లతో ఆయన చర్చించారు. జమ్మలమడుగులో ఇసుక క్వారీని ఏర్పాటుచేయాలని ఆయన కోరారు. ప్రతి పనికి తనకు అడ్డుతగులుతున్నారనే ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు.

రామసుబ్బారెడ్డికి త్వరలోనే ఎమ్మెల్సీ పదవి
పార్టీ కోసం రామసుబ్బారెడ్డి కుటుంబం పనిచేస్తోంది. అయితే పార్టీ అవసరాల రీత్యా ఆదినారాయణరెడ్డిని పార్టీలో తీసుకోవాల్సిన పరిస్థితులు బాబుకు వచ్చాయి.ఈ విషయాన్ని ఆయన రామసుబ్బారెడ్డికి గతంలోనే వివరించారు.అయినా రామసుబ్బారెడ్డి అసంతృప్తి తగ్గలేదు.అయితే మహానాడు సందర్భంగా నిర్వహించిన పొలిట్ బ్యూరో సమావేశంలో రామసుబ్బారెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని పొలిట్ బ్యూరో తీర్మాణం చేసింది. అంతేకాదు త్వరలో భర్తీ చేసే కార్పోరేషన్ పదవుల్లో రామసుబ్బారెడ్డికి ఏదైనా కార్పోరేషన్ ఛైర్మెన్ గా బాధ్యతలను కట్టబెట్టే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications