టీడీపీ నేత,మాజీ మంత్రికి కరోనా పాజిటివ్... అపోలో ఆస్పత్రిలో చేరిక...

మాజీ మంత్రి,టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డి కరోనా బారినపడ్డారు. రెండు రోజులుగా స్వల్ప లక్షణాలు బయటపడటంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం(అగస్టు 24) వచ్చిన రిపోర్టులో ఆయనకు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. త్వరలోనే కరోనాను జయించి మీ ముందుకు వస్తానని... కార్యకర్తలు,మద్దతుదారులు ఆందోళన చెందవద్దని ఒక ప్రకటన విడుదల చేశారు.

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ కూడా సోమవారం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నట్లు తెలిపారు. రిపోర్టులో తనకు పాజిటివ్‌గా తేలిందన్నారు. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. మంత్రి కరోనా బారిన పడటంతో ఆయనకు సన్నిహితంగా ఉన్న అధికారులు, నాయకులకు కూడా కరోనా టెస్టులు చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఇటీవలే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా కరోనా బారినపడ్డారు.

former minister palle raghunath reddy tested coronavirus positive

కాగా,ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ 3,61,712 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇందులో 2,68,828 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 89,516 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో ఇప్పటివరకూ 3,368 మంది మరణించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 50,686 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా టెస్టుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 54,463 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తం 32,92,501మందికి కరోనా టెస్టులు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+