"జగనాసుర రక్తచరిత్ర"పై పేర్నినాని సెటైర్లు- కోడెల, ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్యలపై ఏవీ..?
ఏపీలో సంచలనం రేపుతున్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో వైఎస్ కుటుంబం పాత్రను టార్గెట్ చేసేలా టీడీపీ తాజాగా జగనాసుర రక్తచరిత్ర పేరుతో ఓ పుస్తకం విడుదల చేసింది. ఇందులో సీఎం జగన్ తో పాటు వైఎస్ కుటుంబానికి చెందిన పలువురిని టార్గెట్ చేశారు. దీనిపై ఇవాళ వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని తీవ్రంగా మండిపడ్డారు.
సీఎం జగన్ పై విషపు రాతలు రాసి జగనాసుర అనే పేరు పెట్టారని పేర్నినాని విమర్శించారు. టీడీపీ ఏదో జాతీయ పార్టీ అయినట్టు.. ఏపీ కి ఓ అధ్యక్షుడు అంటూ ఈ పుస్తకం విడుదల చేసిన అచ్చెన్నాయుడుపై పేర్ని విమర్శలు ఎక్కుపెట్టారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడికి బాడీ తప్ప బ్రెయిన్ లేదన్నారు. అసలు జగనాసుర అనే పుస్తకంలో ఎక్కడా టీడీపీ పేరు కానీ చంద్రబాబు పెరు కానీ లేవన్నారు. ఎందుకు ఇంత భయం...నిజాయితీ ఉంటే పేరు వెయ్యాలిగా అని పేర్ని ప్రశ్నించారు. అసత్యాలు.. విషపు రాతలు కాబట్టి పేరు లేదన్నారు.

వివేకా హత్య జరిగిన సమయంలో టీడీపీ ప్రభుత్వం ఉందని, చంద్రబాబు సీఎం కదా..మరి అప్పుడు ఎందుకు విచారించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. అసలు వివేకా కేసు లో అప్పటి ప్రభుత్వం ఎందుకు చార్జీషీట్ వెయ్యలేదని, ఎందుకు అవినాష్ పేరు చేర్చలేదని పేర్ని అడిగారు. ఎన్టీఆర్ చనిపోయినప్పడు కనీసం సీబీసీఐడి విచారణకు కూడా బాబు ఎందుకు ఇవ్వలేదన్నారు. వివేకా హత్య జరిగిన సమయంలో అప్పటి ప్రభుత్వంలో ఎందుకు కదలిక లేదని పేర్ని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం విచారణ ఎందుకు చెయ్యలేదన్నారు.

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణంపై పుస్తకం ఎందుకు వేయలేదని టీడీపీ నేతల్ని పేర్ని ప్రశ్నించారు.కోడెల ఫోన్ ఎక్కడుంది, కోడెల ఫోన్ లో చంద్రబాబు గురించి ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవమానాలు భరించలేక మరణిస్తున్నా అని కోడెల చెప్పాడా అని అడిగారు. ఎందుకు కోడెల ఫోన్ ధ్వంసం అయిందీ, ఓ పుస్తకం వెయ్యండని పేర్ని సూచించారు. ఎన్టీఆర్ కుమార్తె మరణం పై కూడా పుస్తకం వేసి సీబీఐ విచారణ కోరాలన్నారు. ఎన్టీఆర్ పైనే కుట్ర పన్ని నాశనం చేశారని పేర్ని గుర్తుచేసారు. ఎన్టీఆర్ కు ఎందుకు ఆ స్థితి వచ్చింది అనే దానిపై కూడా విచారణ చేయాలన్నారు.












Click it and Unblock the Notifications