రామోజీ మరణంపై మాజీ మంత్రి రోజా రియాక్షన్

ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు సంస్థల అధినేత, నిర్మాత అయిన రామోజీరావు శనివారం ఉదయం మరణించారు.మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేశారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది. రెండు రోజుగా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు ఆయన కన్నుమూశారు. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు రామోజీరావు.

రామోజీరావు మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఆయన మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేసీఆర్, చంద్రబాబు, జగన్ వంటి నేతలు రామోజీ మరణంపై తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తాజాగా మాజీ మంత్రి రోజా రామోజీ మరణంపై స్పందించారు. రామోజీరావుతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Former minister Roja s reaction on Ramoji rao death

ఆమె తన అధికారిక ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...ప్రముఖ సినీ నిర్మాత, పాత్రికేయ మరియు టీవి రంగంలో విప్లవాత్మక మార్పును విశేష కృషిని అందించిన పద్మవిభూషణ్ రామోజీరావు గారి మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరనిలోటు, వారి సంస్థ ఉషాకిరణ్ లో పని చేసిన నాటి రోజుల నుండి ప్రతి ఇంట నవ్వులు పూయించిన టీవిషో జబర్దస్త్ వరకు వారితో ఉన్న నా అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ వారి పవిత్ర ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. Rip Sir🙏 అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+