Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్నకు గుడ్‌బై- చెల్లి పార్టీలో చేరిక: వైసీపీ- టీడీపీ కూటమికి సవాల్

Amanchi Krishna Mohan: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల గడువు సమీపిస్తోన్న వేళ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. టికెట్ దక్కని సీనియర్లు వలసబాట పట్టారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీలను వీడటానికి వెనుకాడట్లేదు. టికెట్ దక్కుతుందనే ఉద్దశంతో ప్రత్యామ్నాయ పార్టీల కండువాలను కప్పుకొంటోన్నారు.

ఈ విషయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల దూకుడుగా వ్యవహరిస్తోన్నారు. టికెట్ రాని అసంతృప్తులను పార్టీ వైపు ఆకర్షితులను చేయడంలో సక్సెస్ అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ సహా వివిధ పార్టీలకు చెందిన అసంతృప్త నాయకులకు ఆమె పార్టీలో చేర్చుకుంటోన్నారు. కండువా కప్పుతున్నారు.

Former MLA and YSRCP leader Amanchi Krishna Mohan met APCC Chief YS Sharmila

ఇప్పటికే ఏలూరు జిల్లా చింతలపూడి, చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నమట్ల ఎలీజా, ఎంఎస్ బాబు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. వారిద్దరినీ కండువా కప్పి మరీ పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ షర్మిల. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని కూడా పార్టీలో చేర్చుకున్నారు. ఈ ముగ్గురికీ అసెంబ్లీ టికెట్లు సైతం లభించాయి.

కిల్లి కృపారాణి టెక్కలి నుంచి పోటీలో నిలిచారు. ఎలీజా, ఎంఎస్ బాబు తమ నియోజకవర్గాల నుంచే బరిలో దిగారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా. ఈ క్రమంలో నంద్యాలకు చెందిన వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ గోకుల కృష్ణారెడ్డి సైతం అసెంబ్లీ టికెట్‌ను సాధించుకోగలిగారు. నంద్యాల అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్నారు.

Former MLA and YSRCP leader Amanchi Krishna Mohan met APCC Chief YS Sharmila

తాజాగా- ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, చీరాల మాజీ శాసన సభ్యుడు ఆమంచి కృష్ణ మోహన్.. కాంగ్రెస్ పార్టీలో చేరబోతోన్నారు. ఇటీవలే ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. గతంలో చీరాల అసెంబ్లీ టికెట్‌ను ఆశించారు గానీ అది సాధ్యపడలేదు. ఆయనను పర్చూరు ఇన్‌ఛార్జీగా అపాయింట్ చేసింది వైసీపీ.

అక్కడ కూడా ఆయనకు టికెట్ దక్కలేదు. కరణం వెంకటేష్‌కు వైఎస్ఆర్సీపీ టికెట్ లభించింది. పర్చూరు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా యడం బాలాజీ పోటీలో నిలిచారు. ఈ రెండు చోట్ల కూడా తనకు టికెట్ లభించకపోవడంతో పార్టీని వీడారు. కాంగ్రెస్ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైంది. ఈ క్రమంలో ఆయన బెంగళూరులో వైఎస్ షర్మిలను కలిశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+