Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP Elections : ఏపీ ఎన్నికల్లో వారిదే గెలుపు..! కారణాలివే-గోనె ప్రకాష్ రావు జోస్యం..!

ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే అంశంపై ఇప్పటికే పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో పోలింగ్ సరళి ఆధారంగా ఈ విశ్లేషణలు సాగుతున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీకి ఉన్న అవకాశాలేంటి ?, కూటమి గెలుపుకు ఉన్న ఛాన్స్ ఎంత అన్న దానిపై బెట్టింగ్ లు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణలు చేసే మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు స్పందించారు.

ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించబోతోందని గోనె ప్రకాష్ రావు జోస్యం చెప్పారు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా సాగిన వైసీపీ పాలనలో ప్రజలు ఇసుక, గనుల అక్రమ మైనింగ్, నాసిరకం మద్యం అమ్మకాలు, పాలనా వైఫల్యాలు, ధరల మోత వంటి ఎన్నో కారణాలు జగన్ ఓటమికి కారణాలుగా నిలవబోతున్నట్లు గోనె ప్రకాష్ తెలిపారు. అందుకే తెలంగాణలో పోలింగ్ ను వదులుకుని ఏపీకి వెళ్లి మరీ ఓటర్లు ఓటేశారన్నారు.

former mla gone Prakash rao prediction on ap election result reveals reasons also

క్రైస్తవులు, మైనార్టీలు, రెడ్లు ఇలా ఏ సామాజిక వర్గం కూడా జగన్ పాలనపై సంతృప్తిగా లేరని గోనె ప్రకాష్ రావు తెలిపారు. జగన్ కు అత్యంత విధేయులుగా ఉన్న వారంతా ఆయన వైఖరితో వదిలివెళ్లిపోయారన్నారు. జగన్ ప్రతీ ఏడాదీ 350 రోజులు రోడ్లపైనే ఉన్నారని, కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎన్టీవోలకు సైతం అపాయింట్ మెంట్ లేదన్నారు. ఎక్కడికి వెళ్లినా పరదాలు కట్టుకుని వెళ్లారన్నారు. ఈ వ్యతిరేకత అంతా ఎన్నికల్లో ప్రతిబింబించిందన్నారు. రెండున్నర లక్షల సంక్షేమం చేసి 13 లక్షల అప్పులు చేశారని గుర్తుచేశారు. మూడు రాజధానులు దేశంలోనే ఎక్కడా లేవన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న హింసను ప్రస్తావిస్తూ.. ఓడిపోతున్నామన్న బాధతోనే వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని గోనె ప్రకాష్ రావు తెలిపారు. గెలిచే వాళ్లు దాడులు చేయరన్నారు. చంద్రబాబు ఈసారి బీజేపీ, పవన్ తో పొత్తు లేకున్నా గెలిచే వారన్నారు. రాయలసీమలో టీడీపీకి 25-29 సీట్లు వచ్చే అవకాశం ఉందని, కోస్తా జిల్లాల్లో ఉత్తరాంధ్రతో పాటు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వారికి మెజార్టీ రాబోతోందన్నారు. కూటమి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, జనం కసిగా ఓటేస్తే మాత్రం 151 సీట్లు దాటినా ఆశ్చర్యం లేదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+