మిస్సింగ్ ఎమ్మెల్యే ఆచూకీ దొరికింది: తిరుపతికి 15కి.మీ దూరంలో.. బాగా నీరసించి!

రెండు రోజులుగా ఆహారం లేకపోవడంతో భిక్షం చాలా నీరసంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయన్ను అంబులెన్స్ ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

తిరుపతి: రెండు రోజుల క్రితం తిరుపతిలో అదృశ్యమైన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం ఆచూకీ లభ్యమైంది. తిరుపతికి 15కి.మీ దూరంలోని కరకంబాడీ సమీపంలో స్థానికులు ఆయన్ను గుర్తించారు. భిక్షం మిస్సింగ్ గురించి టీవీల్లో ప్రసారమైన వార్తలు చూసిన స్థానికులు.. ఆయన్ను గుర్తించారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. కరకంబాడికి చేరుకుని భిక్షంను తమ వెంట తీసుకొచ్చారు.

 former mla kunja biksham found at karakambadi road

రెండు రోజులుగా ఆహారం లేకపోవడంతో భిక్షం చాలా నీరసంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయన్ను అంబులెన్స్ ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కుంజా భిక్షం ఆచూకీ దొరకడంతో ఆయన కుటుంబ సభ్యుల్లో ఆందోళన తొలగిపోయింది. కాగా, శుక్రవారం నాడు తిరుమల వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిన ఆయన.. శనివారం నుంచి కనిపించకుండా పోయారు. భిక్షం అదృశ్యంతో ఆయన సతీమణి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్న తరుణంలో.. కరంకబాడిలో ఆయన ఆచూకీ లభ్యమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+