పిఠాపురంలో వైసీపీకి బిగ్ షాక్: పవన్‌తో భేటీ కానున్న మాజీ ఎమ్మెల్యే

Pawan Kalyan: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో దిగ్భ్రాంతికర ఓటమికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని షాకులు తగులుతున్నాయి. ఈ ఓటమి.. ఆ పార్టీని ఖాళీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పలువురు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు వలసబాట పట్టనున్నారు.

తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ శాసన సభ్యుడు పెండెం దొరబాబు.. పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు కూడా. బుధవారం పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పిఠాపురంలో తన అనుచరులతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.

Former MLA Pendem Dorababu likely to quit YSRCP

పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు పెండెం దొరబాబు. 2014 నాటి ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి స్వతంత్ర అభ్యర్థి ఎస్‌వీఎస్ఎన్ వర్మ చేతిలో 47 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో మళ్లీ పిఠాపురం నుంచే పోటీ చేసి ఘన విజయం సాధించారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను 15 వేల ఓట్ల తేడాతో మట్టికరిపించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ- మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీకి దిగిన నేపథ్యంలో ఆయనను సరితూగేలా మాజీ ఎంపీ వంగా గీతాను బరిలో దింపింది వైఎస్ఆర్సీపీ.

Former MLA Pendem Dorababu likely to quit YSRCP

టికెట్ దక్కకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తోన్నారు. మొన్నటి ఎన్నికల్లోనూ వంగ గీత గెలుపు కోసం పెద్దగా కృషి చేయలేదనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా సాగింది. త్వరలోనే పార్టీ ఫిరాయించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ఈ అనుమానాలకు మరింత బలాన్ని కలిగించేలా నిర్ణయం తీసుకున్నారు పెండెం దొరబాబు. వైఎస్ఆర్సీపీకి గుడ్‌బై చెప్పనున్నట్లు తన అనుచరులకు తెలియజేశారు. త్వరలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+