సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు అనారోగ్యంతో మృతి
సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే రావెల వెంకట్రావు బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన సత్తెనపల్లి శాసనసభ్యులుగా విశేషాసేవలందించారు.
గుంటూరు: సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే రావెల వెంకట్రావు బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన సత్తెనపల్లి శాసనసభ్యులుగా విశేషాసేవలందించారు.
రఘురాం నగర్ కాలనీ ఏర్పడటంతో ఆయన పాత్ర ఎంతో ఉంది. అదే కాలనీలో రామాలయం నిర్మించిన దాత. సత్తెనపల్లి ఫిరంగిపురం పంచాయతీ సమయంలో తాలుకా పరిధిలోని ప్రజలందరికి ఆధునిక వైద్యాన్ని పరిచయం చేసారు.

పేదలకు ఎన్నో సందర్భాలలో ఉచిత వైద్యాన్ని అందించారు. గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణంలో రావెల నియోజకవర్గంలో తన ముద్ర వేసుకొన్నారు. వైద్యునిగా ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన కాంగ్రెస్ నేతలు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది.
.ప్రజలలో ఉన్న ఆదరణతో రావెల ఎమ్మేల్యే గా విజయం సాధించారు. ప్రస్తుత ఎమ్మెల్యే స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభంలో వైద్య రంగంలో రావెల వద్ద కొంతకాలం పని చేసారు . ప్రగాభిమాన్ పొందిన ఎమ్మెల్యే రావెల మృతిపట్ల రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications