ఇచ్చిపడేసిన తోపుదుర్తి- మాస్ వార్నింగ్
Thopudurthi Prakash Reddy: రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీ ఎంత నీచానికైనా దిగజారుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. తనపై ఒక వర్గానికి చెందిన మీడియా, యూట్యూబ్ ఛానళ్లు సాగిస్తోన్న దుష్ప్రచారంపై ఆయన ఘాటుగా స్పందించారు.
ఎయిర్‌పోర్ట్‌లో ఓ అమ్మాయితో తాను కనిపించాడని, ఆమెతో ఆయనకు అక్రమ సంబంధం ఉందంటూ అసభ్యకరమైన హెడ్డింగ్స్, కామెంట్స్ పెడుతూ అధికార పార్టీకి చెందిన కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు తనపై ట్రోల్స్ చేస్తోన్నారంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ ఒక లేఖను విడుదల చేశారు.

రేపు రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రామగిరి మండలం పాపిరెడ్డి పల్లికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తోన్నారని, తెలుగుదేశం పార్టీ దురాగతాలపై గొంతు ఎత్తడానికి, ఆ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయడానికి, హత్యా రాజకీయాలను ఎండగట్టడానికి స్వచ్ఛందంగా వేలాదిగా ప్రజలు తరలి రానున్నారని అన్నారు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్‌ను రామగిరి మండలంలోనికి రానివ్వకుండా అడ్డుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కనిపించట్లేదని తోపుదుర్తి విమర్శించారు. దీనివల్లే తన సమీప బంధువులు, కుటుంబ సభ్యులు అందరినీ కూడా నీచపు రాజకీయ క్రీడలోకి లాగుతున్నారని మండిపడ్డారు.
ఎయిర్‌పోర్ట్‌లో బంధువుల అమ్మాయితో తాను మాట్లాడుతుండగా ఆ వీడియో వైరల్ చేసిన కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులు నీచానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే ఆ వీడియోని అప్‌లోడ్ చేశారో, పోస్టులు పెడుతున్నారో, ఎవరైతే వైరల్ చేస్తోన్నారో వారందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని తోపుదుర్తి హెచ్చరించారు.
ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆయన తేల్చి చెప్పారు. దాదాపుగా 25 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో సంపాదించుకున్న గౌరవ మర్యాదలు ఈ పద్ధతిలో నష్ట పర్చడానికి వాళ్లు ఆలోచన చేస్తే దుర్మార్గమైనటువంటి ఈ విష ప్రచారాన్ని నమ్మే పరిస్థితిల్లో ఎవరు లేరని తోపుదుర్తి అన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఘోర వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాప్తాడు నియోజకవర్గంలో నిజాయితీతో రాజకీయాలు చేస్తూ పేదలకు సేవలు అందిస్తోన్న తనపై బురద చల్లడం వల్ల వాళ్లకు ఎలాంటి ఫలితం ఉండదని అన్నారు. దీనివల్ల గొప్పవారు కాలేరనే విషయాన్ని తెలుసుకోవాలని చెప్పారు.
అదే సమయంలో ఆ ఫొటోలో ఉన్న యువతి, నటి సుమయ రెడ్డి స్పందించారు. ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం తాను డియర్ ఉమ సినిమా ప్రమోషన్లలో ఉన్నానని, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ నుంచి మెసేజ్‌లు, కాల్స్ వస్తోన్నాయని, తీరా చూస్తే ఎయిర్‌పోర్టు వీడియోపై కొందరు నచ్చినట్లుగా కామెంట్స్ చేస్తూ దుష్ప్రచారం చూసి షాక్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తమకు బంధువు అని, దానిపై కూడా ఇలా విష ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిజానిజాలు తెలియకుండా అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆడవారికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ సుమయ రెడ్డి ప్రశ్నించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications