కన్నాపై జగన్ కొత్త అస్త్రం రెడీ..!!
అమరావతి: గుంటూరు జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు చెక్ పెట్టేలా పావులు కదిపింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన మాజీ శాసన సభ్యుడు యర్రం వెంకటేశ్వర రెడ్డి ఇవ్వాళ వైఎస్ఆర్సీపీలో చేరారు. తన కుమారుడు నితిన్ రెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకొన్నారు. ఆ సమయంలో సత్తెనపల్లికే చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట లోక్‌సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు ఆయన వెంట ఉన్నారు.

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి అంబటి రాంబాబుకు టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- తన కుమారుడితో కలిసి యర్రం వెంకటేశ్వరరెడ్డి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సత్తెనపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వెంకటేశ్వర రెడ్డి లేదా నితిన్ రెడ్డి పోటీ చేస్తారనే అభిప్రాయాలు అప్పుడే వ్యక్తమౌతోన్నాయి.
సత్తెనపల్లి నియోజకవర్గంలో కాపు, రెడ్డి సామాజిక వర్గాల ఓటుబ్యాంకు అధికంగా ఉంటుందనే విషయం తెలిసిందే. అంబటి రాంబాబు, వెంకటేశ్వర రెడ్డి ఈ రెండు సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యాన్ని వహించే వారే. ఈ రెండు ఓటు బ్యాంక్‌లను కలుపుకొని వెళ్లే దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేసినట్టయింది. అంబటి రాంబాబు, వెంకటేశ్వర రెడ్డిల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా గానీ.. పరస్పరం సహకరించుకోవాల్సి ఉంటుందని వైఎస్ జగన్ కరాఖండిగా తేల్చేసినట్లు చెబుతున్నారు.

సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు యర్రం వెంకటేశ్వర రెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004, 2009ల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారాయన. ఈ రెండుసార్లు కూడా టీడీపీకి చెందిన కళ్లం అంజిరెడ్డి, నిమ్మకాయల రాజ్‌నారాయణను ఓడించారు. ఆ తరువాత ఆయన పోటీ చేయలేదు. ఇప్పుడు తాజాగా మళ్లీ తెరమీదికి వచ్చారు. దీనితో సత్తెనపల్లి నుంచే పోటీ చేయొచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఈ ఈక్వేషన్లు- తెలుగుదేశం పార్టీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణకు రాజకీయంగా చెక్ పెట్టేలా పరిణమించాయని చెబుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి కన్నా లక్ష్మీనారాయణ రంగం సిద్ధం చేసుకుంటోన్న విషయం తెలిసిందే. కాపు సామాజిక వర్గానికే చెందిన కన్నాకు ఎదురు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ఈ పరిస్థితుల్లో ఆయనపై వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా యర్రం వెంకటేశ్వరరెడ్డిని తెర మీదికి తీసుకుని రావడం ఆసక్తికరంగా మారింది. పోటీ చేసిన రెండుసార్లూ గెలిచిన యర్రం వెంకటేశ్వర రెడ్డికి నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. అలాంటి నాయకుడిని కన్నాపై పోటీకి దింపితే సత్ఫలితాలు ఉంటాయని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు సమాచారం. కాపు-రెడ్డి ఓటుబ్యాంక్‌తో ఈ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవచ్చని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ఐదేళ్ల తర్వాత అదరహో.. లాభాల బాటలో మిరప రైతులు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications