వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ఎంపీ హర్షకుమార్ ఇంట సినీ తార జయప్రద సందడి

సినీ తార జయప్రద రాజమహేంద్రవరంలోని మాజీ ఎంపి హర్షకుమార్ నివాసంలో సందడి చేశారు. అయితే ఆ సమయంలో హర్షకుమార్ ఇంట్లో లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపి వెళ్లారు జయప్రద.

|
Google Oneindia TeluguNews

రాజమహేంద్రవరం : సినీ తార జయప్రద రాకతో అమలాపురం మాజీ ఎంపీ జివి.హర్షకుమార్‌ ఇంట్లో సందడి చోటుచేసుకుంది. ఆలయ సందర్శన నిమిత్తం రాజమహేంద్రవరం విచ్చేసిన మాజీ ఎంపి, సినీతార జయప్రద మాజీ ఎంపి హర్షకుమార్‌ను కలుసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఆయన ఊర్లో లేకపోవడంతో హర్షకుమార్ కుమారుడు జివి శ్రీరాజ్‌ జయప్రదను మర్యాదపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించి, కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. అందాలనటిగా ఎంతో పేరు తెచ్చుకున్న జయప్రద అనూహ్యంగా తమ ఇంటికి రావడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనైన హర్షకుమార్ కుటుంబ సభ్యులు ఆనందంగా ఆమెకు అతిధి మర్యాదలు చేసి సంతోషాన్ని పంచుకున్నారు.

నంది అవార్డుల వివాదంపై...

నంది అవార్డుల వివాదంపై...

సినీతార జయప్రద రాక గురించి తెలుసుకొని హర్షకుమార్ నివాసానికి చేరుకున్న విలేకర్లతో ఆమె కాసేపు ముచ్చటించారు. హర్షకుమార్ నివాసానికి తన రాకలో ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు. నంది అవార్డ్స్‌ అనేవి ప్రతిష్టాత్మకమైనవన్నారు. అవార్డులను ఇవ్వడానికి న్యాయనిర్ణేతలు ఉన్నారని, ఆ పని ఎలా చేయాలో వారికి బాగా తెలుసన్నారు. అయితే సమాజానికి ఉపయోగపడే చిత్రాలకు అవార్డ్స్‌ ప్రకటించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సినీ రంగంలో తమ తరానికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. కాలానుగుణంగా సంగీతంలో మార్పు సహజమని ట్రెండ్‌ బట్టి మార్పు అనివార్యమన్నారు. అయితే మహానటి సావిత్రి తరంలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తాయని సంగీతానికి ఉన్న ప్రాధాన్యత అలాంటిదన్నారు.

 బాహుబలి గురించి..

బాహుబలి గురించి..

బాహుబలి వంటి చిత్రాలు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం హర్షణీయమన్నారు. బాహుబలిలో రమ్యకృష్ణ నటన అద్భుతంగా ఉందని, తనకు ఎంతగానో నచ్చిందని ప్రశంసించారు. బాహుబలి చిత్రంపై జమున చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా జమున చేసిన వ్యాఖ్యల గురించి తనకు తెలియదన్నారు. అయితే తాను సినీజీవితంలో ప్రవేశించిన తొలినాళ్లలో ఆమె అడుగుజాడల్లోనే నడిచినట్టు గుర్తుచేసుకున్నారు.

జయప్రద అసలు పేరు....

జయప్రద అసలు పేరు....

తన స్వస్థలం రాజమండ్రి అని, అసలు పేరు లలితా రాణి అని, తాను రాజమండ్రిలోనే తెలుగు మీడియంలో చదువుకున్నానని జయప్రద చెప్పారు. ఇప్పడు ఇన్ని భాషల్లో మాట్లాడుతున్నానంటే అది షాడే పాఠశాలలో విద్యా పునాది వల్లేనని తెలిపారు. అయితే ఆ పాఠశాల ఇప్పుడు వివాదంలో చిక్కుకుందని తెలిసి బాధకలిగిందన్నారు. తన సౌందర్య రహస్యం అంత త్వరగా బయటపెట్టనని సరదాగా అన్నారు. అయితే మాజీ ఎంపి హర్షకుమార్ ను కలుసుకునేందుకు మాజీ ఎంపి జయప్రద రావడం రాజకీయంగా ఆసక్తి రేపింది.

English summary
Rajahmundry:The Former Member of Parliament Smt. Jaya Prada Visited Former MP GV Harsha Kumar Residency in Rajahmundry. Jaya Prada on Her Visit to Temples in East Godavari has Visited Harsha Kumar House for Coffee. In The Absence of his Father The Young Leader GV Sri Raj Accommodated / Garlanded her and Took Blessing of The Senior Political Leader. Family Member & Media with Few in Number are Informed for this visit. She Also Spoke About Nandi Award in Rajahmundry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X