Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలవరంపై బాబుది లాలూచీ, అన్నీ బయటపెడతా, మోడీతో బాబుకు శత్రుత్వమా, మిత్రుత్వమా: ఉండవల్లి

Recommended Video

    పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబునాయుడు లాలూచీ

    రాజమండ్రి: ప్రధానమంత్రి మోడీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు మిత్రుత్వం ఉందో, శత్రుత్వం ఉందో చెప్పాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతోందనే విషయాలను త్వరలోనే బయటపెట్టనున్నట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించారు.

    బుధవారం నాడు ఉండవల్లి అరుణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు పోలవరం ప్రాజెక్టుపై గతంలో తాను వ్యక్తం చేసిన అనుమానాలే నిజమయ్యాయని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు

    పోలవరంపై బాబుది లాలూచీ

    పోలవరంపై బాబుది లాలూచీ

    పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుది లాలూచీకి పాల్పడుతున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టును ప్రకటిస్తే ఆ పనులను రాష్ట్రం ఎందుకు చేస్తుందని ఆయన ప్రశ్నించారు.తక్కువ ధరకే నవయుగ కంపెనీకి పనులు అప్పగించారని చంద్రబాబునాయుడు చెప్పారని, కానీ, ఈ పనులను కేంద్ర మంత్రి గడ్కరీ అప్పగించారని అంటున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు.

    పోలవరంపై వాస్తవాలు దాస్తున్నారు

    పోలవరంపై వాస్తవాలు దాస్తున్నారు

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తన అనుమానాలు నిజమయ్యాయని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. 2016 వరకు పోలవరం ప్రాజెక్టు పనులే చేపట్టలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే శ్వేతపత్రం కూడ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతందని ఆయన ప్రశ్నించారు. అన్నీ విషయాలను త్వరలోనే బయటపెడతానని ఉండవల్లి చెప్పారు.

    మోడీతో బాబుది ఏ వైఖరి

    మోడీతో బాబుది ఏ వైఖరి

    ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏ వైఖరితో ఉన్నారో చెప్పాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. మోడీతో చంద్రబాబునాయుడు మిత్రత్వంతో ఉన్నారా, శత్రుత్వాన్ని కొనసాగిస్తున్నారో బయటపెట్టాలని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.

    పవన్ ‌పై బాబు వ్యాఖ్యలు సరికావు

    పవన్ ‌పై బాబు వ్యాఖ్యలు సరికావు


    జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు సరికావని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. జెఎఫ్‌సి సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయమై కూడ చర్చించామని ఆయన గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన విషయాలపై సమాధానం చెప్పకుండా ఆయనపై టిడిపి నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+