2029లోనూ ఏపీలో ఎవరు గెలవచ్చు ? తేల్చేసిన ఉండవల్లి..!
ఏపీలో రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి సర్కార్ ప్రస్తుతం అధికారంలో ఉంది. రెండేళ్ల పాలన తర్వాత కూటమి పాలనపై రాష్ట్రవ్యాప్తంగా మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మరోవైపు విపక్ష వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ముఖ్యంగా అమరావతి రాజధానితో పాటు పలు కీలక అంశాల్లో ప్రభుత్వంతో విభేదిస్తున్న వైసీపీకి తిరిగి ఏపీలో ఛాన్స్ ఉంటుందా లేదా అన్న చర్చపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (undavalli arun kumar) స్పందించారు.
ఏపీలో ప్రస్తుతం నెలకున్న పరిస్ధితుల ఆధారంగా చూస్తే.. విపక్ష వైసీపీకి 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు అంత సులువు కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించారు. కూటమి పార్టీలు కలసి ఉంటే పోటీ చాలా కఠినమని, విడిపోతే మాత్రం వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుందని ఉండవల్లి తెలిపారు. అలాగే ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని ఉండవల్లి తెలిపారు. దీనిపై భారత ఎన్నికల సంఘం స్పందించకపోవడం ఆశ్చర్యమని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ లో టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ మూడు పార్టీల కూటమికే గత ఎన్నికల్లో జనం ఓటేశారు. అలాగే మరోసారి కూడా వీరు కూటమిలో భాగస్వాములుగా ఉంటూ జనం వద్దకు వెళ్తే కచ్చితంగా ప్రయోజనం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అలా కాకుండా వీరు వీడిపోతే మాత్రం కష్టమని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ఈ మధ్యే తన అంచనా సైతం వెల్లడించారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. కూటమి పార్టీలు విడిపోతే తప్ప జగన్ కు అవకాశం కష్టమేనని ఆయన తేల్చిచెప్పేస్తున్నారు.












Click it and Unblock the Notifications