ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్‌

ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలోని పభుత్వ ఉద్యోగులకు రూ.7,358 కోట్ల పెండింగ్‌ బిల్లుల విడుదలకు సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆర్థికశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఉద్యోగులకు రూ.7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఏ మాత్రం నిధుల లభ్యత ఉన్నా పెండింగ్ బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు రూ.7,358 కోట్ల మేర పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యల్ని వేగవంతం చేసింది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు రూ.7,358 కోట్ల పెండింగ్‌ బిల్లుల విడుదలపై సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖపై సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్‌ బిల్లులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలా గతంలో తాను ఇచ్చిన ఆదేశాల అమలుపై అధికారులను ఆరా తీశారు. అయితే నిధుల లభ్యతను బట్టి చెల్లిస్తున్నామని.. రూ.7,358 కోట్ల విడుదలకు చర్యలు తీసుకున్నామని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. అయితే ఏ మాత్రం నిధుల లభ్యత ఉన్నా పెండింగ్ బిల్లులు చెల్లించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

CMChandrababu Clears 7 358 Crore Pending Bills for Government Employees in Andhra Pradesh latest

ఆర్థిక శాఖతో జరిపిన సమీక్షలో భాగంగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటికే ఉద్యోగులకు చెల్లించినవి చూస్తే.. ప్రావిడెంట్‌ ఫండ్‌ బకాయిలు రూ. 1,848 కోట్లు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యాయి. అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793 మందికి సంబంధించి రూ.76 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి. వీటితో పాటు గ్రాట్యుటీ బకాయిలు రూ.3,411 కోట్లు, లీవ్ ఎన్‌ క్యాష్ ‌మెంట్ కింద రూ.1,800 కోట్లు విడుదలయ్యాయి. ఇక పోలీస్ శాఖకు సంబంధించి అదనపు సరెండర్ లీవుల నిమిత్తం రూ.223 కోట్ల బిల్లుల విడుదల ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+