కల్తీ నెయ్యిపై తేల్చేసిన ఉండవల్లి..! జైల్లో అంబటితో భేటీ..!

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వివాదంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (undavalli arun kumar) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు తర్వాత రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత అంబటి రాంబాబును ఆయన ఇవాళ ములాఖత్ లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నెయ్యి కల్తీ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంబటి రాంబాబు 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పటి నుంచీ తనకు పరిచయమని ఉండవల్లి తెలిపారు. వ్యక్తిగత పరిచయంతోనే ఇవాళ ములాఖాత్ కు వచ్చానని వెల్లడించారు. చంద్రబాబు కొత్త ఒరవడి మొదలు పెట్టారని, తిట్టిన వాళ్లకి రాజమండ్రి సెంట్రల్ జైలు, కొట్టిన వాళ్లకి స్టేషన్ బెయిలు ఇస్తున్నారన్నారు. ఈ రకమైన సంప్రదాయం మంచిది కాదన్నారు. అలాగే తిరుమల లడ్డూ కల్తీపై జరుగుతున్న రచ్చ, చంద్రబాబు వ్యాఖ్యలపై ఉండవల్లి స్పందించారు.

undavalli arun kumar key comments on ghee adulteration row after meeting Ambati rambau in jail

తిరుమల నెయ్యిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువని సిట్ నివేదిక 20వ పేజీలో స్పష్టంగా పేర్కొన్నారని ఉండవల్లి తెలిపారు. కానీ చంద్రబాబు పదేపదే జంతువుల కొవ్వు అని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. టాయిలెట్స్ కాడిగే లిక్విడ్ అని కూడా అంటున్నారన్నారు. తిరుపతి ప్రసాదం గురించి సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడడం సరికాదన్నారు.చంద్రబాబు ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పి మాట్లాడరని, కానీ తిరుమల లడ్డూ విషయం లో ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదన్నారు. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దైవ ద్రోహం అవుతుందన్నారు. బీజేపీ వాళ్లు కూడా చంద్రబాబులా మాట్లాడటం లేదన్నారు. ఈ విషయంపై ఇప్పటికైనా చంద్రబాబు పునరాలోచించాలని ఉండవల్లి కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+