జగన్ వ్యాఖ్యలకు కౌంటర్..! పత్రికా ప్రకటనపై విజయసాయిరెడ్డి క్లారిటీ..!
ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఉన్నట్లుండి ఎంపీ పదవికీ, వైసీపీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం పుచ్చుకున్న విజయసాయిరెడ్డి ఆ తర్వాత మద్యం స్కాంపై తనకు అంతా తెలుసంటూ వ్యాఖ్యానించారు. దీంతో సీఐడీ ఆయన్ను పిలవడం, విచారణ తర్వాత బయటికి వచ్చి జగన్ తో పాటు వైసీపీ నేతల్ని టార్గెట్ చేయడం జరిగిపోయాయి. ఆ తర్వాత సాయిరెడ్డి సైలెంట్ గానే ఉన్నా మద్యం స్కాంలో ఆయన ఇచ్చిన వాంగ్మూలంపై వైసీపీ గుర్రుగా ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ .. లిక్కర్ స్కాంపై మాట్లాడుతూ విజయసాయిరెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మూడున్నరేళ్ల పదవీకాలం ఉంచుకుని ఎంపీ పదవిని కూటమి కోసం వదులుకున్న రోగ్ ఎంపీ విజయసాయిరెడ్డి అని... అలాంటి వ్యక్తి చెప్పే మాటలకు విలువ ఏముంటుందని ప్రశ్నించారు. అంతే కాదు ఆయన చంద్రబాబుకు లొంగిపోయారన్నారు.

దీనికి స్పందనగా సాయిరెడ్డి చెప్పినట్లు ఓ పత్రికా ప్రకటన సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. తాను మారనని, తన వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుందని, పదవి వచ్చాక నువ్వే మారిపోయావు, నేను ఎప్పడూ ఇలాగే ఉన్నాను, మూడు దశాబ్దాలుగా నాకు రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి. నేను ప్రలోభాలకు లొంగను. ఎవరీకీ భయపడను అంటూ సాయిరెడ్డి చెప్పినట్లు ఈ ప్రకటనలో ఉంది. అయితే దీనిపై సాయిరెడ్డి ఇవాళ ఎక్స్ లో స్పందించారు.
నా పేరు మీద సర్క్యులేట్ అవుతున్న పత్రికా ప్రకటన విషయం మీడియాలో కొందరు మిత్రుల ద్వారా తెలిసింది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 24, 2025
ఆ ప్రకటన నాది కాదు. నేను చేసిన, చేయబోయే పత్రికా ప్రకటనలు నా అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా మాత్రమే వెలువడతాయి . గమనించగలరు.
తన పేరు మీద సర్క్యులేట్ అవుతున్న పత్రికా ప్రకటన విషయం మీడియాలో కొందరు మిత్రుల ద్వారా తెలిసిందని సాయిరెడ్డి తెలిపారు. ఆ ప్రకటన తనది కాదన్నారు. తాను చేసిన, చేయబోయే పత్రికా ప్రకటనలు తన అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా మాత్రమే వెలువడతాయి, గమనించగలరు అంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీంతో సాయిరెడ్డి ఈసారి జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications