చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని...శ్రీవారికి మొక్కుకున్నా:యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
తిరుపతి:తిరుమల శ్రీ వెంకటేశ్వరుని స్వామివారిని శుక్రవారం ఉదయం మాజీ ఎంపి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ దర్శించుకున్నారు. దర్శన కార్యక్రమాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు భాషను ఓ సబ్జెక్టుగా పెడతామని చెప్పిన కేవలం మాటలకే పరిమితమయ్యారని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విమర్శించారు. తెలుగు భాష అభివృద్ధి కోసం చంద్రబాబు చేసింది శూన్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో కెసిఆర్ ఇచ్చిన మాటపై నిలబడి తెలుగు భాషకు ప్రాణం పోశారని, కానీ చంద్రబాబు తెలుగు భాష వ్యతిరేకి అని ఆయనమండిపడ్డారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని తిరుమల శ్రీవారిని మొక్కుకున్నానని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నవారిలో ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!