పులివెందుల రాజకీయంలో కీలక పరిణామం - సీఎం జగన్ పర్యటన వేళ..!!

ముఖ్యమంత్రి జగన్ పులివెందులలో ఉన్నారు. ఇడుపుల పాయలో తన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద నివాళి అర్పించారు. తన సొంత నియోజకవర్గం పులివెందుల కేంద్రంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో వైఎస్సార్ ఆ తరువాత సీఎం జగన్ పైన పోటీ చేసిన టీడీపీ మాజీ నేత సతీష్ రెడ్డి వైసీపీ ముఖ్య నేతలతో టచ్ లోకి వచ్చారు. 2019 ఎన్నికల తరువాత సతీష్ రెడ్డి టీడీపికి దూరమయ్యారు.

తిరిగి ఆయన్ను టీడీపీలోకి తీసుకొనే ప్రయత్నాలు జరుగుతన్నాయి. దీంతో, వైసీపీ ముఖ్య నేతలు సతీష్ రెడ్డిని వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ముఖ్యమంత్రి పులివెందులో ఉన్న సమయంలో సతీష్ రెడ్డి వైసీపీలోకి రావటం పైన స్పష్టత వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

Former TDP leader Satish Reddy likely to join in YSRCP , Party leaders discussions with CM Jagan

పులివెందులో వైఎస్సార్ హయాం నుంచి జగన్ వరకు టీడీపీ అభ్యర్ధిగా సతీష్ రెడ్డి పోటీ చేసారు. వైఎస్సార్ బలాన్ని ఢీకొట్టి నిలబడిన వ్యక్తిగా పేరుంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత శాసన మండలి సభ్యుడు అయ్యారు. ఆ తరువాత మండి డిప్యూటీ ఛైర్మన్ గా వ్యవహరించారు. కానీ, 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత సతీష్ రెడ్డి టీడీపీకి దూరంగా ఉంటున్నారు.

ఆ సమయంలోనే సతీష్ రెడ్డి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం సాగింది. కానీ, అమలు కాలేదు. ప్రస్తుతం పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ గా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీటెక్ రవి పులివెందుల అభ్యర్ధిగా చంద్రబాబు ఖరారు చేసారు. ఇదే సమయంలో సీఎం జగన్ బంధువువలను టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

Former TDP leader Satish Reddy likely to join in YSRCP , Party leaders discussions with CM Jagan

ఈ సమయంలో సతీష్ రెడ్డిని తిరిగ టీడీపీలోకి వెళ్లనీయకుండా.. వైసీపీలో చేర్చుకోవాలనేది నియోజకవర్గ వైసీపీ నేతల వ్యూహం. టీడీపీకి బీటెక్ రవి కంటే సతీష్ రెడ్డి బలం అదనంగా కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. సతీష్ రెడ్డికి పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం కావటంతో అక్కడ బలమైన వర్గం ఉంది. టీడీపీ ఆహ్వానించినా సతీష్ రెడ్డి తిరిగి ఆ పార్టీకి దగ్గరయ్యే అవకాశాలు లేవని చెబుతున్నారు.

ఈ సమయంల పులివెందులలో ప్రస్తుతం పార్టీ సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంపీ అవినాశ్ రెడ్డి తాజాగా సతీష్ రెడ్డికి సంబంధించి ప్రతిపాదన తెచ్చినట్లుగా తెలుస్తోంది. దీని పైన సీఎం జగన్ తో చర్చించి..ఒప్పించేలా ప్రయ్నాలు జరగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అన్నీ సెట్ అవుతే..సీఎం జగన్ పులివెందులో ఉన్న సమయంలో సతీష్ రెడ్డి వైసీపీలో ఎంట్రీ పై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+