తడాఖా చూపిస్తోన్న కేశినేని నాని: వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
Nallagatla Swamy Das: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో కల్లోలం చోటు చేసుకుంటోంది. పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఆ పార్టీకి ప్రతికూలంగా తయారవుతున్నాయి. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తోన్న ధోరణి- సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది.
విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని.. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. బుధవారం సాయంత్రం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు.

ఈ రాజీనామాల పర్వం ఆయనతో ఆగట్లేదు. చెప్పినట్టుగానే ఆయన ఉమ్మడి కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయించే పనిలో పడ్డారు. ఇదివరకే విజయవాడకు చెందిన టీడీపీ యువ నాయకురాలు, ఆయన కూతురు కేశినేని శ్వేత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు.
ఇక తాజాగా టీడీపీకి చెందిన మరో సీనియర్ నాయకుడు పార్టీని వీడారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకొన్నారు. తన భార్యతో సహా ఆ నేత వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.
ఆయనే- ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మాజీ శాసన సభ్యుడు నల్లగట్ల స్వామి దాస్. తన భార్య సుధారాణితో కలి టీడీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా సాగుతోంది. దీనికి అనుగుణంగా ఆయన కొద్దిసేపటి కిందటే క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిశారు. ఆయన చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్నారు.
కేశినేని నానికి ప్రధాన అనచరుడిగా పేరుంది స్వామిదాస్‌కు. 1994, 1999 ఎన్నికల్లో ఆయన వరుసగా టీడీపీ అభ్యర్థిగా తిరువూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ.. ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు టీడీపీ. మాజీ మంత్రి కేఎస్ జవహర్‌ను పోటీ చేయించింది గానీ.. రిజల్ట్ మాత్రం మారలేదు.

స్వామిదాస్‌తో పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన మరికొందరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు పార్టీ ఫిరాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. నూజివీడుకు చెందిన టీడీపీ సీనియర్ నేత ముద్దబోయిన వెంకటేశ్వర్ రావు త్వరలో వైసీపీలో చేరొచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications