Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుపై కేశినేని నాని పోస్ట్- టీడీపీలో రీఎంట్రీ ప్రచారం వేళ..!

ఏపీలో ఒకప్పుడు టీడీపీ తరఫున రెండుసార్లు విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలిచిన కేశినేని నాని(శ్రీనివాస్)కు పార్టీకి విధేయుడిగా పేరుండేది. కానీ సొంత పార్టీలో ప్రత్యర్దులు పెరిగిపోవడం, వారికి అధిష్టానం నుంచి మద్దతు లభించడంతో చేసేది లేక గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అక్కడ ఎంపీ సీటు తెచ్చుకున్నా ఓడిపోయారు. దీంతో రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయినా సోషల్ మీడియాలో నాని యాక్టివ్ గానే ఉంటున్నారు.

ఇదే క్రమంలో ఇవాళ సీఎం చంద్రబాబును ఉద్దేశించి కేశినేని నాని ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో చంద్రబాబుకు వజ్రోత్సవ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో చంద్రబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుచేశారు. అసలే టీడీపీలోకి కేశినేని నాని రీఎంట్రీకి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సమయంలో చంద్రబాబుతో అనుబంధాన్ని నాని గుర్తుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

former tdp mp kesineni nani greets Chandrababu on birthday amid tdp joining rumours

సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఫేస్ బుక్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మైలురాయి ప్రజా జీవితంలో సుదీర్ఘ ప్రయాణాన్ని, దశాబ్దాల రాజకీయ నాయకత్వం, పాలన, ప్రజా సేవను సూచిస్తుందని నాని తెలిపారు. ఒక నిర్దిష్ట దశలో ఆ ప్రయాణంలో భాగం అయ్యే అవకాశం తనకు లభించిందన్నారు. ఆ అనుభవాన్ని తాను అంగీకరిస్తున్నట్లు కూడా నాని తెలిపారు. మీకు మంచి ఆరోగ్యం, నిరంతర బలం, ప్రజా జీవితంలో, సేవలో మరిన్ని చురుకైన సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్తూ కేశినేని నాని తన పోస్టును ముగించారు.

గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ అంతకు ముందు తాను కలిసి పనిచేసిన వ్యక్తులతో కేశినేని నాని తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన్ను తిరిగి టీడీపీలోకి వచ్చేయాలంటూ ఆఫర్లు వచ్చాయి. అయితే రాజకీయాల్లో రీఎంట్రీపై ఏ నిర్ణయం తీసుకోలేదంటూ కేశినేని నాని గతంలో పలు మార్లు చెప్పారు. విజయవాడ ఎంపీగా ఉన్న నాని సోదరుడు చిన్ని పార్టీలో చేరికలపై కూటమి నియమించిన కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఈ మధ్యే చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Take a Poll

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+