మాజీ పోలీసు ఉన్నతాధికారి కూతురిపై జాతివివక్ష దాడి

బెంగళూరు: జాతివివక్షకు సంబంధించిన మరో సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. ఈశాన్య భారతదేశానికి చెందిన ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి కూతురిపై జాతి వివక్ష దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. నగరంలో షాపింగ్ చేస్తుండగా ఆ సంఘటన జరిగినట్లు సమాచారం.

బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, మాజీ పార్లమెంటు సభ్యుడు హెచ్‌టి సంగ్లియానా కూతురు రేచల్ సంగ్లియానా అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తనపై ఓ మహిళ జాతివివక్షకు సంబంధించిన వ్యాఖ్యలు చేసిందని, ఆ తర్వాత తనపై దాడి చేసిందని, తాను ఎదుర్కోవడానికి ప్రయత్నించగా మరో మహిళ కూడా తనపై దాడి చేసిందని ఆమె ఆరోపించారు.

 Former top cop's daughter hailing from North-East alleges racial slur

తాను బెంగళూరులోనే పుట్టిపెరిగానని, తనపై ఇద్దరు మహిళలు దాడి చేసిన విషయాన్ని ఫేస్‌బుక్‌లో రేచల్ పోస్టు చేశారు. డిసెంబర్ 7వ తేదీన తనపై దాడి జరిగిన విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. నాగాలాండ్‌కు చెందిన ముగ్గురు అమ్మాయిలు, ఓ లేడీ స్టాఫ్, ఓ పురుషుడు తన టీనేజ్ కూతురు తనకు సహాయంగా వచ్చారని, 50 మందికిపైగా చూస్తుండగా ఆ సంఘటన జరిగిందని ఆమె చెప్పారు.

గొడవ ఎక్కడ ప్రారంభమైందనే విషయాన్ని ఆమె చెప్పలేదు. ఆదివారంనాడు సూపర్ మార్కెట్లో క్యూను దాటేసి పోవడానికి ఇద్దరు మహిళలు ప్రయత్నించినప్పుడు గొడవ ప్రారంభమైనట్లు చెబుతున్నారు. తమకు ఏ విధమైన ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని బెంగళూర్ దక్షిణ డిసిపి బిఎస్ లోకేష్ కుమార్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+