జగన్ ఇక కష్టమే.. నోరు జారిన చంద్రబాబు-కేంద్ర మాజీ మంత్రి షాకింగ్..!
ఏపీలో ఐదేళ్ల వైసీపీ పాలన తర్వాత మాజీ సీఎం జగన్ మరోసారి తన పార్టీని ఎన్నికల్లో గెలిపించుకోలేకపోయారు. దీనికి కారణాలు ఏవైనా తిరిగి పుంజుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. త్వరలో జగన్ 2.0 ఉంటుందని కూడా చెప్పేశారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి ఒకరు ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తిరిగి అధికారంలోకి రావడం కష్టమేనని తేల్చిచెప్పేశారు.
జగన్ మళ్లీ రాడు రాడని కరాఖండిగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ఇవాళ తేల్చేశారు. వైయస్సార్ సడన్ గా చనిపోయాడని, ఆయన కుటుంబ సభ్యులు సోనియా గాంధీ, ముఖేష్ అంబానీపై నెపం నెట్టారని తెలిపారు. సానుభూతితో జగన్ ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. తర్వాత అదేే ముఖేష్ అంబానీ చెప్పిన వ్యక్తికే రాజ్యసభ సీటు ఇచ్చాడన్నారు. జగన్ చెల్లెలు సోనియా గాంధీని కలిసి ఫోటోలు తీయించుకుంటోందని షర్మిలపై మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడం మా అన్నకు భలే ఇష్టమంటోందన్నారు.

అంతటితో ఆగకుండా భారతదేశంలోనే కాదు, ప్రపంచ రాజకీయ నాయకుల్లో జగన్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడని చింతా మోహన్ తెలిపారు. ట్రంప్ కంటే, నాలుగింతలు ఎక్కువ ఆస్తి, డబ్బు జగన్ సంపాదించాడన్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు నోరు జారాడని, సూపర్ సిక్స్ ఇస్తామన్నాడని చింతా మోహన్ తెలిపారు. అధికారంలోకి వచ్చాక, అమలు చేయడం నావల్ల కాదని చేతులెత్తేశాడన్నారు. ప్రజలు నిరాశతో ఉన్నారని, వర్గీకరణ వల్ల ఆంధ్రాలో నూటికి 90 శాతం ఉన్న మాలలు చంద్రబాబుపై కోపంగా ఉన్నారని చింతా మోహన్ వెల్లడించారు.
ఒకప్పుడు కాంగ్రెస్ అంటేనే ఛీ... థూ అన్నవాళ్లు ఇప్పుడు ప్రేమగా పలకరిస్తున్నారని చింతా మోహన్ తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారని, ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ మంచి రోజులు రానున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ చెప్పుకొచ్చారు. మరోవైపు కొల్లేరు భూ ఆక్రమణలు పై కమిషన్ వేసి విచారణ జరిపి, ఆక్రమణదారులను జైల్లో పెట్టాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. జ్వరం తగ్గి, ఆరోగ్యం కుదుటపడిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి నెలాఖరులోలోగా కొల్లేరుకు వచ్చి భూ అక్రమణాలను పరిశీలించాలన్నారు. చిత్తూరు భూఆక్రమణల తరహాలోనే కొల్లేరుపైనా పవన్ స్పందించాలన్నారు.












Click it and Unblock the Notifications