వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉచితాలు సరికాదు -తనతో సహా మాజీ సీజేఐకు పదవుల వెనుక : వెంకయ్య నాయుడు..!!

|
Google Oneindia TeluguNews

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. ఉచితాలు సైన మరోసారి తన అభిప్రాయం స్పష్టం చేసారు. ఉచితాలు ఇవ్వడం సరికాదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలు సంపద పెంచేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు. మాతృభాషకు సంబంధించి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. విశాఖ పర్యటనలో భాగంగా వెంకయ్యనాయుడు ఈ అంశాలపైన స్పందించారు. విద్యార్థులు క్రమశిక్షణ తో, కష్టపడే మనస్తత్వం కలిగి ఉండాలని సూచించారు.

వెంకయ్య నాయుడు ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చే ఉచితాలపైన మరోసారి స్పందించారు. గతంలో చెప్పిన అంశాలనే మరోసారి స్పష్టం చేసారు. ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వటం సరి కాదన్నారు. ప్రభుత్వాలు సంపదను పెంచే ప్రయత్నాలు చేయాలి నా, ఈ విధానం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. విశాఖలోని తగరపువలస గోస్తనీ నది సమీపంలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాల స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంపదను ఉచితంగా ఇస్తే ప్రజలు అభివృద్ధి లోకి రారని వ్యాఖ్యానించారు. ఇక, మాతృభాష అభ్యసించటం పైనా వెంకయ్య స్పందించారు. మాతృభాష కనుచూపు లాంటిందని.. విదేశీ భాష కళ్లజోడు లాంటిదని విశ్లేషించారు.

Former Vice President Venkaiah Naidu cautions against freebie culture at Vizag

మాతృభాషలో విద్యను అభ్యసించిన వారు దేశంలో ఉన్నత పదవులు చేపట్టారని వివరించారు. తనతో సహా మాతృభాషలో విద్యను అభ్యసించిన ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి అయ్యారన్నారు. అదే విధంగా ప్రధాని మోదీ, మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కూడా మాతృభాషలోనే విద్యాభ్యాసం చేసిన వారని వివరించారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలను ఇంగ్లీషు మీడియం విద్యా బోధన పైన నిర్ణయం తీసుకున్న సమయం నుంచి ఈ అంశం పైన చర్చ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపైన వచ్చిన విమర్శలకు అప్పట్లోనే సీఎం జగన్ సహా వైసీపీ నేతలు స్పందించారు. పేదలకు ఇంగ్లీషు మీడియం విద్య చదువుకొనే హక్కు లేదా.. వారికి ఆ అవకాశం ఉండకూడదా అంటూ నిలదీసారు. ఆంగ్ల భాషలో బోధనకు తాము వ్యతిరేకంగా కదని.. మాతృభాషను విస్మరించకూడదనేది తమ అభిప్రాయమనే వివరణలు వచ్చాయి.

English summary
Former Vice President Venkaiah Naidu comments on Govt Free Schemes and Eduction reforms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X