వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పులతో పంచుకుంటూ పోతే - చేయాల్సింది ఇదీ : వెంకయ్య నాయుడు..!!

|
Google Oneindia TeluguNews

మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు కీలక వ్యాఖ్య‌లు చేశారు. ప్రస్తుత రాజకీయాలు ఆరోగ్యకరంగా లేవని, బురదగుంట కన్నా చండాలంటా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. పార్టీలన్నీ ఎలా నడుస్తున్నాయో, అందరికీ తెలిసిందేనని..వాటి గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అదే సమయంలో రాష్ట్రాల్లో అప్పులు - పంపకాల గురించి వెంకయ్య స్పందించారు. సంపద పెంచకుండా.. పంచుకుంటూ పోతే చివరికి పంచె మాత్రమే మిగులుతుందని చెప్పుకొచ్చారు. పంచాలంటే ముందుగా సంపద సృష్టించాలని సూచించారు.

రుణాలు తీసుకొని పంచటం సరైన విధానం కాదని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం తాయిలాల మీద‌నే భారీ ఎత్తున చ‌ర్చలు జ‌రుగుతున్నాయ‌ని చెప్పుకొచ్చారు. తాను పదవికి మాత్రమే విరమణ చేసానని, ప్రజాజీవితానికి కాదని వెంకయ్య వ్యాఖ్యానించారు. ఒక‌ప్పుడు రాజ‌కీయాలను రాజ‌కీయాల మాదిరిగానే చూసేవార‌ని, సేవ చేయ‌డానికే ప్రాధాన్య‌త ఇచ్చేవార‌ని వివరించారు. సంప‌ద పెంచేందుకు ఎక్కువ దృష్టి సారించేవార‌ని..కానీ, ఇప్పుడు దానికి రివ‌ర్స్‌లో రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయ‌ని ఆవేద‌నన వ్య‌క్తం చేశారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేసారు. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో తాను విద్యార్ధిగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు.

Former Vice president Venkaiah naidu interesting comments on Schemes implementation

ఆ సమయంలో కోనేరు రామక్రిష్ణారావు వీసీగా ఉన్నారని..తనను చూసి ఈ కుర్రోడు దేశానికి గొప్ప నాయకుడు అవుతాడని అప్పట్లోనే ఆయన చెప్పారని వెంకయ్య వివరించారు. ఆయన మాటలు తనకు ఎంతో ప్రేరణ ఇచ్చాయని చెప్పారు. ఇక...ఏపీలో పర్యటించిన కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రాష్ట్రాల అప్పుల గురించి ప్రస్తావించారు. ఎక్కడా ప్రభుత్వం పేరును ప్రస్తావన చేయకుండానే రాష్ట్రా అర్దిక పరిస్థితి..సంపద పెరుగుదల.. పంపకాల గురించి మంత్రులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

English summary
Former Vice president Venkaiah Naidu interesting comments on states Assets creation and schemes implmentation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X